మోసగాళ్ళు తరహాలో మరో భారీ రిస్క్ చేయడానికి సిద్దమవుతున్న మంచు విష్ణు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు విష్ణు ఇటీవల మోసగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. 50కోట్ల బడ్జెట్ తో నిర్మించగా వరల్డ్ వైడ్ గా కనీసం రెండు కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. అయితే ముందుగానే నాన్ థియేట్రికల్ గా సినిమా 30కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది.
డిజిటల్, శాటిలైట్ మార్గాల్లో అన్ని భాషల్లో కలుపుకొని సినిమాకు 30కోట్లయితే వచ్చాయి. అదొక్కటే సంతోషకరమైన విషయం. కానీ థియేట్రికల్ గా మాత్రం కనీసం సగంలో కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. 20కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా కేవలం కోటి కంటే తక్కువ షేర్ ను మాత్రమే అందుకుంది. సినిమాను మంచు విష్ణు సొంత బ్యానర్ లో తెరకెక్కించిన విషయం తెలిసిందే.

అయితే విష్ణు మరో రిస్క్ చేయడానికి సిద్ధమైనట్లు టాక్ వస్తోంది. గతంలో చాలాసార్లు భక్త కన్నప్ప గురించి మాట్లాడిన విష్ణు తప్పకుండా ఆ సినిమా ఉంటుందని డిఫరెంట్ వెరీయేషన్స్ లో కథను రెడీ చేయించినట్లు చెప్పాడు. ప్రస్తుతం విష్ణు, శ్రీనువైట్ల దర్శకత్వంలో డీ & డీ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమా తరువాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భక్త కన్నప్పను తెరకెక్కిస్తానని మంచు విష్ణు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి ఆ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











