లాక్‌డౌన్ అయ్యేలోపు అలా.. కొత్త అవతారమెత్తిన మంచు విష్ణు
కరోనా వైరస్ వచ్చి.. ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. ఈ వైరస్ ధాటికి తట్టుకోలేక అగ్రరాజ్యమే అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19 లక్షలకు పైగా కరోనా బారిన పడ్డారు. లక్షకు పైగా దుర్మరణం చెందారు. మన దేశంలోనూ కరోనా రోజురోజుకూ తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే 11 వేలకుపైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.
విరుగుడు లేని ఈ కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. మొదటగా 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించగా..ఏప్రిల్ 14తో ముగిసింది. మరో 19 రోజుల పాటు పొడిగించి మే 3 వరకు లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని ప్రధాని ఆదేశించారు. లాక్ డౌన్ విధించిన క్షణం నుంచి సెలెబ్రిటీల నుంచి సామాన్య జనం వరకు అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు.

అప్పుడప్పుడు సామాన్యజనం అయినా రోడ్ల మీదుకు వస్తున్నారు కానీ, సెలెబ్రిటీలు మాత్రం ఇంటికే పరిమితం అయ్యారు. ఇంట్లోనే ఉంటూ వంటింటి చిట్కాలు, ఆరోగ్య చిట్కాలు, వ్యాయమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో మంచు విష్ణుసైతం గరిట పట్టాడు. కొత్తరకం వంటకం చేసి నోరూరించాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. లాక్ డౌన్ పూర్తయ్యే లోపు సహనంతో కూడుకున్న ఓ మంచి వంటగాడిలా తయారువుతానంటూ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











