జగన్‌ని కలసిన మంచు విష్ణు దంపతులు!
ఎన్నికల సమరం దగ్గర పడుతుండడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నారు. రాజకీయ వ్యూహాలతో బిజీగా గడుపుతున్న ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ని మంచు విష్ణు, ఆయన సతీమణి విరోనికా లోటస్ పాండ్ లో కలుసుకున్నారు. జగన్ నివాసంలో మంచు విష్ణు దంపతులు కాసేపు ఆయనతో ముచ్చటించారు. మంచు విష్ణు టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
జగన్ తో మంచు విష్ణు భేటీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మోహన్ బాబు రాబోవు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానంటూ ప్రచారం జరుగుతోంది. దీనితో జగన్, మంచు విష్ణుల భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఉందని అంటున్నారు. మంచు విష్ణు సతీమణి విరోనికా జగన్ కు సమీప బంధువు. అందువలనే కలిసారని మరి కొందరు అంటున్నారు.

మంచు విష్ణు చివరగా ఆచారి అమెరికా యాత్ర చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఓటర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల మంచు విష్ణుకు సరైన విజయం లేదు. మోహన్ బాబు సినీ నటుడిగానే కాక శ్రీ విద్యానికేతన్ సంస్థలతో కూడా తిరుపతి, ఆ పరిసర ప్రాంతాల్లో గుర్తింపు పోయిందారు. దీనితో ఏదో ఒక నియోజకవర్గం నుంచి మోహన్ బాబు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











