పుస్తకపఠనంలో మునిగిన మంచు విష్ణు.. నెటిజన్ల కామెంట్స్ వైరల్
మంచు విష్ణు మళ్లీ యథా స్థానానికే వచ్చాడు. అసలే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మంచు విష్ణుకి మోసగాళ్లు రూపంలో హిట్ వస్తుందని అందరూ భావించారు. మంచు విష్ణు దాదాపు యాభై కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం నిండా ముంచేసింది. పెట్టిన దాంట్లో కనీసం పది శాతం కూడా రికవరీ చేసినట్టు కనిపించడం లేదు. మొత్తానికి మోసగాళ్లు రూపంలో మరో డిజాస్టర్ వచ్చింది.
మొత్తానికి మంచు విష్ణు ఇప్పుడు మళ్లీ ఖాళీగా ఉన్నాడు. మోసగాళ్లు సినిమాకు కథ, కథనం అందించడంలో మంచు విష్ణు ఎంతో కష్టపడ్డాడు. కానీ ఆయన కష్టానికి తగ్గ ఫలితం మాత్రం రాలేదు. మొత్తానికి ఇప్పుడు మంచు విష్ణు మాత్రం శ్రీనువైట్ల సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అందుకోసం బాడీని పెంచేస్తున్నాడు. తాజాగా మంచు విష్ణు ఓ పోస్ట్ చేశాడు. తాను చదువుతున్న పుస్తకం గురించి చెప్పుకొచ్చాడు.

తనకు మామూలుగా పుస్తక పఠనం అంటే ఇష్టమని కానీ అందులోనూ ఫిక్షన్ స్టోరీలు చదవడం అంటే మహా ఇష్టమని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. జీవిత చరిత్రలు, బయోపిక్స్ వంటివి అంతగా ఎక్కకాపోయినా.. ఈ సమ్మర్‌లో పూర్తి చేయాల్సిన పుస్తకాలు చాలానే ఉన్నాయని మంచు విష్ణు అన్నాడు. ఇకఈ పోస్ట్‌పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సినిమాలన్నీ పోయాక ఇంత కంటే ఏం చేయగలమని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మళ్లీ ఓ మంచి సినిమా చేయ్ అన్నా అంటూ మంచు విష్ణును కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











