రెడీ అవుతోన్న మంచు విష్ణు పొలిటికల్ మూవీ!
మంచు విష్ణు చాలా కాలంగా విజయం కోసం ప్రయత్నిస్తున్నాడు. విష్ణు చివరగా నటించిన ఆచారి అమెరికా యాత్ర చిత్రం నిరాశ పరిచింది. ప్రస్తుతం ఈ మంచువారబ్బాయి నటిస్తున్న చిత్రం ఓటర్. జిఎస్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకుడు. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరక్కుతోంది. తాజాగా ఈ చిత్ర నిర్మాత జాన్ సుధీర్ మాట్లాడుతూ.. ఓటర్ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
రాజకీయ నేపథ్యంలో, ఓటు హక్కు ప్రాముఖ్యతని తెలియజేసేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. రాజకీయ నాయకుల భవితవ్యాన్ని ప్రజలు ఈ ఓటు హక్కుతోనే తేల్చుతారు. ఈ చిత్రంలో మంచు విష్ణుకి జోడిగా సురభి నటించింది. ఉత్కంఠ భరితంగా సాగే ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో మంచు విష్ణు అద్భుతంగా నటించారని నిర్మాత అన్నారు.

తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. విష్ణు కెరీర్ లో ఢీ, దేనికైనా రెడీ లాంటి హిట్స్ ఉన్నాయి. విష్ణు తదుపరి చిత్రం శ్రీనువైట్ల దర్శత్వంలో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











