For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గుడ్డిగా నమ్మి మోసపోయాను.. బన్నీ ఒకసారి తిట్టేసాడు కూడా: మంచు విష్ణు

  |

  మంచు హీరో విష్ణు నటించిన మోసగాళ్ళు సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బిగెస్ట్ మనీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను విష్ణు తన హోమ్ ప్రొడక్షన్ లోనే నిర్మించాడు. ఇక మిక్సీడ్ టాక్ ను అందుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందించాల్సి ఉంది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు కొంతమంది కారణంగా జీవితంలో మోసపోయినట్లు చెప్పాడు.

  రిజల్ట్ తో సంబంధం లేకుండా

  రిజల్ట్ తో సంబంధం లేకుండా

  గత 15 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న విష్ణు బాల నటుడిగా అంతకుముందే కొన్ని సినిమాల్లో నటించాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా ముందుకు వెళుతున్న విష్ణు కెరీర్ లో కొన్ని ఊహించని డిజాస్టర్స్ కూడా ఎదుర్కొన్నాడు. ప్రయోగాత్మకమైన సినిమాలు దారుణంగా నష్టాలను కలిగించాయి.

   నమ్మడం నా వీక్ నెస్

  నమ్మడం నా వీక్ నెస్

  అయితే విష్ణు తన ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. అయితే ఎదుటి మనిషిని ఈజీగా నమ్మడం తన వీక్ నెస్ అంటూ అలా చేయడం వల్ల చాలా సార్లు దెబ్బతిన్నానని అన్నాడు. మోసగాళ్ళు సినిమాలో బ్రదర్ అండ్ సిస్టర్ అమెరికన్స్ ను మోసం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ తన జీవితంలో కూడా కొందరు అలా ఉన్నారని అన్నాడు.

  గుడ్డిగా ఫాలో అవ్వడం వల్లనే

  గుడ్డిగా ఫాలో అవ్వడం వల్లనే

  ఎక్కువగా దర్శకులను నమ్మడం వల్లనే మోసపోయానని చెప్పిన మంచు విష్ణు వాళ్ళను నమ్మి గుడ్డిగా ఫాలో అవ్వడం వల్లనే నష్టపోయినట్లు చెప్పారు. ఇక జీవితంలో అలాంటి తప్పులు చేయకూడదని డిసైడ్ అయినట్లు చెబుతూ ఆ మోసాల వలన చాలా నేర్చుకున్నానని కూడా వివరణ ఇచ్చారు.

  డబ్బుంటే సంతోషం ఉండదు

  డబ్బుంటే సంతోషం ఉండదు

  ఇక డబ్బు గురించి మాట్లాడుతూ.. డబ్బు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ టెన్షన్ ఉంటుంది. సంతోషంగా ఉండలేము. ఏదైనా చిన్న సంతోషం వచ్చినా హ్యాపీగా నవ్వగలగాలి. అలాంటి లైఫ్ బావుంటుంది. డబ్బు సంపాదించే క్రమంలో పరిగెత్తుతూ ఆ లైఫ్ ను మిస్సవుతున్నాం. నా కూతుళ్లు వచ్చాక ఆ సంతోషం విలువేంటో తెలిసింది.. అను విష్ణు తెలిపారు.

  బన్నీ తిట్టేసాడు

  బన్నీ తిట్టేసాడు

  ఇండస్ట్రీలో కళ్యాణ్ రామ్ , ప్రభాస్ చాలా క్లోజ్ గా ఉంటారు. దాదాపు ప్రతి ఒక్కరు నాతో ఫ్రెండ్లిగా ఉంటారు. గ్రూప్స్ లలో కలవడం నాకు ఎక్కువగా ఇష్టం ఉండదు. చరణ్ పార్టీలలో ఎక్కువగా కలుస్తుంటాడు. చాలా మందికి నేనొక మాట ఇచ్చాను. వంటి చేసి బార్బీ క్యూ రెడీ చేస్తానని. అయితే మొన్న బన్నీ నన్ను తిట్టాడు. టీజర్ లాంచ్ చేయాలి అన్నప్పుడు దీని తరువాత బార్బీ క్యూ చేస్తానని చెప్పాను. అయితే చెప్తూనే ఉన్నావ్ గాని ఇంకా పిలవలేదు అని సరదగా తిట్టేసాడు. నెక్స్ట్ టైమ్ మాత్రం తప్పకుండా పిలుస్తానని బన్నీతో చెప్పినట్లు విష్ణు వివరణ ఇచ్చాడు.

  English summary
  Manchu Vishnu, one of the senior most heroes in the Tollywood industry, did not receive much box office hits as a commercial. However he did not stop any of the attempts. Every once in a while he keeps testing his luck at the box office with a movie. And Next mosagallu is ready to hit a good hit with the movie anyway. However, Manchu Vishnu clarified that his father Mohan Babu was very dissatisfied with one thing.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X