Karthikeya 2: నిఖిల్ కు మద్దతుగా మంచు హీరో.. కంటెంట్ ఎల్లప్పుడూ గెలుస్తుంది అంటూ..
ఈ నెలలో ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తున్న సినిమాలలో కార్తికేయ 2 సినిమా కూడా టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా ఆగస్టు 12 న గ్రాండ్ గా విడుదల అవుతోంది. ఇక ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాను ఎప్పటి నుంచి విడుదల చేయాలని మూడు నెలలుగా చిత్ర యూనిట్ సభ్యులు గట్టిగానే ప్రయత్నాలు చేశారు.
కానీ తన సినిమాను కావాలని వెనక్కి తీసేసినట్లు అనిపించింది అని హీరో నిఖిల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యాడు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉంటే ఇలానే ఉంటుందేమో అని ఓ వర్గం ప్రేక్షకులు కూడా అతనికి మద్దతుగా నిలిచే ప్రయత్నం అయితే చేశారు. ఇక నిఖిల్ కు సపోర్ట్ చేస్తూ మంచు విష్ణు కూడా సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

నేను ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉంటాను బ్రదర్.. ధైర్యంగా ఉండు.. అందరూ అంగీకరించినట్లుగా కంటెంట్ ఎల్లప్పుడూ గెలుస్తుంది. కార్తికేయ 2 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక మంచు విష్ణు అలా సపోర్ట్ చేయడంతో నిఖిల్ కూడా వెంటనే పాజిటివ్ గా ప్రతిస్పందించారు విష్ణు భాయ్ మీ మాటలు నాకు మా టీమ్ కి ఎంతో ముఖ్యమైనవి అని పాజిటివ్ గా స్పందించాడు.
ఇక సినీ నటులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా కార్తికేయ 2 సినిమాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక విధంగా ఇది డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతుంది అని కూడా ముందుగానే మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు కార్తికేయ సినిమా విడుదల రోజే నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా విడుదల అవుతొంది. మరి ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











