Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఓటర్ సినిమాతో సరికొత్త రికార్డు అందుకున్న మంచు విష్ణు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో విబిన్నంగా ప్రయోగాలు చేసే హీరోల్లో మంచు విష్ణు ఒకరు. మోహనన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తో కొన్ని మంచి సినిమాలు చేశాడు. కథల విషయంలో అతను మరింత జాగ్రత్తగా ఉంటే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయగలడని చెప్పవచ్చు.
అయితే కమర్షియల్ గా అంతగా హిట్టవ్వని సినిమాలు కూడా ఈ మధ్య యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. టాలీవుడ్ హిందీ డబ్ సినిమాలకు గత కొంతకాలంగా భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. ఇక మంచు విష్ణు నటించిన ఓటర్ కూడా ఇటీవల ఒక రికార్డును అందుకుంది. 50 మిలీయన్ల వ్యూవ్స్ అందుకొని ట్రెండింగ్ లిస్టులో కొనసాగుతోంది.
పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు జిఎస్. కార్తిక్ దర్శకత్వం వహించగా జాన్ సుధీర్ నిర్మించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి విష్ణు నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఇక ఇటీవల మోసగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష్ణు ఆ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ డీ అండ్ డీ తో డబుల్ డోస్ కామెడీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా శ్రీనువైట్ల స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసినట్లు తెలుస్తోంది.