వివి వినాయక్ నెక్స్ట్ మూవీ హీరో అతడేనా!
మంచు విష్ణుకు ప్రస్తుతం ఓటర్ చిత్రంలో నటిస్తున్నాడు. విష్ణు నటించిన గత చిత్రాల్లో నిరాశ పరిచాయి. దీనితో విష్ణు త్వరలో ఓ మాస్ చిత్రాన్ని చేయాలని భావిస్తునట్లు తెలుస్తోంది. దీని కోసం మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వివి వినాయక్ తదుపరి చిత్రం ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశం కనిపించడం లేదు. వివి వినాయక్ తదుపరి బాలయ్యతో ఓ చిత్రం చేయాలని భావిస్తున్నాడు. బాలయ్య ఎన్టీఆర్ బియోపిక్ తో బిజీగా ఉన్నాడు. అంటే సంక్రాంతి వరకు బాలయ్య బిజినే. ఏ గ్యాప్ లో వివి వినాయక్ మరో చిత్రం చేయాలనుకుంటే తాను రెడీగా ఉంటానని మంచు విష్ణు తన సన్నిహితుడు గోపి మోహన్ ద్వారా వినాయక్ కు సందేశం పంపినట్లు తెలుస్తోంది.

కానీ ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందొ తెలియాల్సి ఉంది. వివి వినాయక్ సన్నిహితులు మాత్రం అతడి ఫోకస్ మొత్తం బాలయ్య చిత్రం పైనే ఉందని అంటున్నారు. వివి వినాయక్ తెరకెక్కించిన ఇంటెలిజెంట్ చిత్రం నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











