Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
మంచు విష్ణు ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటున్నాడు. మోసగాళ్లు సినిమా ఆల్రెడీ ఫినిషింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఇక శ్రీను వైట్ల చేయబోతోన్న సినిమా గురించి మంచు విష్ణు తెగ కష్టపడుతున్నాడు. డబుల్ డోస్ అంటూ ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్, ప్రకటన తెగ వైరల్ అయింది. అయితే ఈ సినిమా కోసం శ్రీను వైట్ల అందరినీ బాగానే హింసించినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మంచు విష్ణు తాజాగా చెప్పుకొచ్చాడు.
డబుల్ డోస్ సినిమా కోసం మంచు విష్ణు తన శరీరాకృతిని మార్చుకునే పనిలో పడ్డాడు. తాజాగా జిమ్‌లో కష్టపడుతున్న వీడియో మంచు విష్ణు షేర్ చేశాడు. దీంతో పాటు ఓ కామెంట్ కూడా చేశాడు. డబుల్ డోస్ కోసం కష్టపడుతున్నాను.. రెడీ అవుతున్నాను.. ఇంకో 45 రోజులు ఇలా వర్కవుట్లు చేయాల్సిందే.. అప్పుడే కరెక్ట్ షేప్‌లోకి వస్తాను. ఆయన ఏదైనా లుక్ కావాలని అనుకుంటే శ్రీను వైట్ల శాడిస్ట్‌లా పట్టుబడతాడు.. 20 ఇంచుల బైసిప్స్ కోసం ట్రై చేస్తున్నాను అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.
మంచు విష్ణు, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబోలో 13ఏళ్ల క్రితం వచ్చిన 'ఢీ' ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అందుకే మళ్లీ ఇన్నేళ్లకు ఆ కాంబోలో డబుల్ డోస్ అంటూ సినిమాను ప్రకటించడంతో అంచనాలు పెరిగాయి. అసలే శ్రీను వైట్లు, విష్ణు ఇద్దరూ కూడా ఇప్పుడు ఫాంలో లేరు. కానీ ఈ చిత్రంతో మళ్లీ తమ సత్తాను చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో అను ఇమాన్యుయేల్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తోన్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి.