For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2 వేల నోటు కింద పడితే ముఖేష్ అంబానీ ఎందుకు తీసుకోడంటే... The Family Man 2లో టెర్రిఫిక్‌గా మనోజ్ బాజ్‌పేయ్

  |

  బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలకు, విలక్షణ నటనకు మనోజ్ బాజ్‌పేయ్ కేరాఫ్ అడ్రస్ అని కొత్తగా చెప్పనవసరం లేదు. రాంగోపాల్ వర్మ రూపొందించిన సత్య చిత్రంలో నట విశ్వరూపంతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకొన్న ఆయన.. ఆ తర్వాత ఎన్నో గొప్ప పాత్రలతో మెప్పించాడు. ఇక ఇటీవల కాలంలో వెబ్ సీరిస్‌లో నటిస్తూ ది ఫ్యామిలీ మ్యాన్ ద్వారా విశేషమైన ప్రతిభను చాటుతున్నారు. అలాగే తాజాగా రిలీజైన ది ఫ్యామిలీ మ్యాన్ 2‌లో మరోసారి తన టాలెంట్‌తో బుల్లితెరను రఫ్ ఆడించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  The Family Man 2 Review | Samantha, Screenplay రెండూ సూపర్ !! || Filmibeat Telugu
  NIA‌ లో TASC అధికారి

  NIA‌ లో TASC అధికారి

  ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే శ్రీకాంత్ తివారీ అనే పాత్రలో మనోజ్ బాయ్‌పేజ్ జీవించాడు. మొదటి సీజన్‌లో NIAకు సంబంధించిన TASC విభాగంలో దేశానికి విద్రోహం చేసే వారిని ఆట కట్టించే ఆఫీసర్‌గా అద్భుతంగా నటించాడు. సీజన్‌1లో మనోజ్ బాజ్‌పేయ్ తన ఒంటి చేత్తో వెబ్ సిరీస్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాడని చెప్పవచ్చు.

  ఇష్టం లేని జాబ్‌లో మానసిక సంఘర్షణ

  ఇష్టం లేని జాబ్‌లో మానసిక సంఘర్షణ

  ఇక రెండో సీజన్ విషయానికి వస్తే మనోజ్ బాజ్‌పేయ్ క్యారెక్టర్ లో ప్రొఫైల్‌లో మొదలవుతుంది. కుటుంబ కోసం NIAలోని TASC లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఓ కార్పోరేట్ ఆఫీస్‌లో చేరుతాడు. తనకు ఇష్టమై ఉద్యోగాన్ని వదులుకొని.. ఇష్టం లేని జాబ్‌ను చేస్తూ ఓ రకమైన మానసిక సంఘర్షణకు గురవుతుంటాడు. ఆ క్రమంలో తన కంటే చిన్నవాడైన 29 ఏళ్ల సీఈవోతో మాటలు పడుతుంటాడు. అవమానాలు ఎదుర్కొంటుంటాడు.

  సీఈవోతో వేధింపులు

  సీఈవోతో వేధింపులు

  ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లోని మనోజ్ బాజ్‌పేయ్‌కి సంబంధించి పలు సన్నివేశాల్లో ఆయనకు గట్టిగా సీఈవోతో క్లాస్ పీకుతాడు. 39 ఏళ్ల వయసులో కంపెనీకి సీఈవో ఎందుకయ్యాను.. ఎలా అయ్యానో గ్రహించావా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. అంతేకాకుండా ముఖేష్ అంబానీ ప్రస్తావన తెస్తాడు. శ్రీకాంత్ తివారీని కంపెనీ సీఈవో ప్రశ్నిస్తూ.. ముఖేష్ అంబానీ ఒక నిమిషం ఆదాయం ఎంతో తెలుసా అని అడుతాడు.. అందుకు సమాధానంగా రెండు వేలు అంటూ అమాయకంగా శ్రీకాంత్ తివారీ తన సీఈవోకు సమాధానం ఇస్తాడు.

  ముఖేష్ అంబానీ ఆదాయం ఎంతో తెలుసా?

  ముఖేష్ అంబానీ ఆదాయం ఎంతో తెలుసా?

  దాంతో చిరాకు పడిన సీఈవో ముఖేష్ అంబానీ ఒక సెకను లక్షకుపైగా సంపాదిస్తాడు. అంటే నిమిషానికి ఎంతో సంపాదిస్తాడో ఊహించుకో. ఒకవేళ రూ.2 వేల నోటు కింద పడితే తీసుకోడు. ఎందుకంటే ఒక సెకనులో లక్ష సంపాదించే అవకాశాన్ని కోల్పోతాడు అంటూ శ్రీకాంత్ తివారీకి సీఈవో సమాధానం చెబుతాడు. అంతేకాకుండా మరో సందర్భంలో మినిమమ్ గయ్‌గా ఉండోద్దు అంటూ ఉపదేశం చేస్తాడు. ఇలాంటి వేదనల మధ్య శ్రీకాంత్ తివారీ గట్టిగా దండించి ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు.

  కూతురు కిడ్నాప్ ఎపిసోడ్‌లో

  కూతురు కిడ్నాప్ ఎపిసోడ్‌లో

  ఇదిలా ఉంచితే... మనోజ్ బాజ్‌పేయ్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో అద్బుతంగా పలు సన్నివేశాలను పండిచాడు. తన కూతురు కిడ్నాప్ అయిన సందర్భంలో అతడు పలికించిన హావభావాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఇక భార్యకు ధైర్యం చెబుతున్న సన్నివేశాల్లో ఆయన నటన బుల్లితెరను భావోద్వేగానికి గురిచేస్తుందంటే నమ్మాల్సిందే. ఇక కూతురును విడిపించడానికి చేపట్టిన ఆపరేషన్‌లో మనోజ్ యాక్టింగ్ మరో లెవల్ అని చెప్పవచ్చు.

  యాక్షన్ ఎపిసోడ్స్‌లో మరో రేంజ్‌లో

  యాక్షన్ ఎపిసోడ్స్‌లో మరో రేంజ్‌లో

  ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో తమిళ టెర్రిరిస్టు సమంతను పట్టుకొనే యాక్షన్ ఎపిసోడ్‌లోను అద్బుతంగా మెప్పించాడు. ఫైట్స్, ఎమోషన్స్ పండించడంలో తనకు తానే సాటి అనిపించుకొనే రేంజ్‌లో నటించాడు. అలాగే పోలీస్ స్టేషన్‌పై దాడి సమయంలో కూడా మనోజ్ బాజ్‌పేయ్ యాక్షన్ మాటల్లో చెప్పలేం. ఇలాంటి ఎన్నో సన్నివేశాలతో మనోజ్ బాజ్‌పేయ్ మైమరిపించాడని చెప్పవచ్చు.

  మూడో సీజన్ రెడీ అవుతున్న మనోజ్ బాజ్‌పేయ్

  మూడో సీజన్ రెడీ అవుతున్న మనోజ్ బాజ్‌పేయ్


  ఇక ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత 3 సీజన్‌కు శ్రీకాంత్ తివారీ సిద్దమవుతున్నారనే విషయం ఈ వెబ్ సిరీస్ చివర్లో చెప్పకనే చెప్పారు. ఫస్ట్ సీజన్‌లో ఐఎస్ఐ తీవ్రవాదులను, రెండో సీజన్‌లో తమిళ టెర్రరిస్టులతో పోరాటం చేసిన మనోజ్ బాజ్‌పేయ్ ఇక మూడో సీజన్‌లో కరోనావైరస్‌ వ్యాప్తి చేసే చైనా దుష్ట శక్తులపై పోరాటానికి సిద్దమవుతున్నారు.

  English summary
  The Family Man 2 series going good in OTT Amazon Prime Video. Manoj Bajpai nce again proved his best in season 2. Inspirational reference of Mukesh Ambani goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X