21 రోజుల్లో మనోజ్ మంచు అమేజింగ్ ట్రాన్స్‌ఫార్మ్.. కండల వీరుడిగా మారిన డేవిడ్ రెడ్డి
ప్రేక్షకులు, అభిమానుల అభిరుచి తగినట్టుగా నటులు తమ కెరీర్‌ను డిజైన్ చేసుకొంటే సక్సెస్ నూటికి నూరు శాతం సాధించవచ్చని యువ హీరో, వెర్సటైల్ యాక్టర్ మంచు మనోజ్ నిరూపించాడు. కొద్దికాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం భారీ ఆఫర్లతో వరుస విజయాలను సొంతం చేసుకోవడమే కాకుండా క్రిటిక్స్ నుంచి, సాధారణ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. అభిమానులు, ఆడియెన్స్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని యువతకు స్పూర్తి కలిగించే విధంగా తన లుక్‌ను మార్చుకొంటూ అందరికి స్పూర్తిని కలిగిస్తున్నాడు. తాజాగా డేవిడ్ రెడ్డి సినిమాలోని తన పాత్ర కోసం కఠోర శ్రమతో దేహధారుడ్యాన్ని పెంచుకోని అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెడుతూ..
మంచు మనోజ్ తాజాగా మిరాయ్ సినిమాలో విలన్ షేడ్స్ పాత్రతో అదరగొట్టాడు. తనదైన డైలాగ్ డెలివరీ, హావభావాలతో ఎలాంటి పాత్రను చేయడానికైనా సిద్దమే అంటూ ఇండస్ట్రీకి సంకేతాలిచ్చారు. మిరాయ్ అందించిన సక్సెస్ జోష్‌తో విభిన్నమైన చిత్రాలు, విలక్షణతో కూడిన పాత్రలతో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఆ నేపథ్యంలోనే చేస్తున్న చిత్రం డేవిడ్ రెడ్డి సినిమా కోసం ఊహించని లుక్‌తో ముందుకు వస్తున్నాడు.

డేవిడ్ రెడ్డి సినిమా డిమాండ్ చేయడంతో సమూలంగా తన బాడీని మార్చుకొనేందుకు రెడీ అయ్యానని తాజాగా ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో వెల్లడించారు. మూడు వారాల క్రితం నేను ఓ కఠినమైన నిర్ణయం తీసుకొన్నాను. కంఫర్ట్‌తో జీవితాన్ని అలవాటు చేయవద్దని భావించాను. ఎలాంటి మినహాయింపులు, డొంక తిరుగుడు సమాధానాలు లేకుండా.. ఈ సోమవారం నుంచి మొదలుపెడుతాను అనేది లేకుండా.. రియల్ స్టంట్స్ మోడ్‌లోకి అడుగుపెట్టాను. అలా వర్కవుట్స్ స్టార్ట్ చేశాను అని మనోజ్ తన పోస్టులో తెలిపారు.
యాక్షన్ సినిమా చేసేటప్పుడు.. డూప్, నకిలీ స్టంట్స్ చేయకూడదని భావించాను. ప్రతీ పంచ్, తలపడే సీన్లలో కిందపడే విషయంలో నీ బాడీ నేచురల్ ఎబిలిటీని షో చేయాలి. నీవు అలా చేయకపోతే నీ వైపు కెమెరా కూడా చూడదు. నీ ఇంటెన్షన్స్‌ను పెద్దగా పట్టించుకోదు. కెమెరా కేవలం నీ సత్తాను మాత్రమే క్యాప్చర్ చస్తుంది. అందుకే కఠోరమైన నియమాలతో ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. నీ దేహమే నీ వృత్తి అని భావించినప్పుడు.. మోసగించడం కుదరదు. ప్రతీ గాటు నీకొక సంతకం. అలిసిపోయే తీసే ప్రతీ శ్వాస నీ ప్రతిభకు గుర్తింపు అని మనోజ్ ఎమోషనల్ అయ్యారు. గత 3 వారాలుగా కొనసాగుతున్న ఈ శ్రమ.. ఇంకా కొనసాగుతుంది. 21 రోజుల తర్వాత నేను అంతకు ముందున్న మనోజ్ కానని నా బాడీ నాకు గుర్తు చేసింది. అదే నాకు ఇప్పుడు పూర్తి సంతృప్తిని ఇచ్చింది అంటూ మనోజ్ తన పోస్టులో పేర్కొన్నారు.
ఇక డేవిడ్ రెడ్డి సినిమా విషయానికి వస్తే.. మనోజ్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాను హనుమ రెడ్డి యెక్కంటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోతుకూరి నిర్మిస్తున్నారు. 1897-1920 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగే కథతో డేవిడ్ రెడ్డి సినిమా రూపొందుతున్నది. అణచివేతకు ఎదురు తిరిగే ఒక ధైర్యవంతుడైన యోధుడి జర్నీని ఇందులో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో ఇంటర్నేషనల్ స్టార్ మారియా ర్యాబోషాప్కా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన డేవిడ్ రెడ్డి గ్లింప్స్‌కు అన్నీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.త్వరలోనే ఈ చిత్రంతోపాటు మరొకొన్ని సినిమాలతో మనోజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


Click it and Unblock the Notifications











