మారుతి దర్శత్వంలో మెగా హీరో!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తేజు కెరీర్ కు చాలా కీలకం. సాయి ధరమ్ తేజ్ నటించిన గత చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. దీనితో తేజు చిత్రలహరిపై దృష్టి పెట్టాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిస్తుండడం విశేషం. తేజు సరసన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రంపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించబోతునట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే మే నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Maruthi to direct Mega hero Saidharam Tej next project

శైలజారెడ్డి అల్లుడు చిత్రం తర్వాత మారుతి ఇంత వరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. కొంత మంది యువ హీరోలతో సినిమా ఉండబోతోందని ప్రచారం జరిగినా ఆ వార్తలని మారుతి ఖండించాడు. సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రలహరి చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X