RT70: మరో ఆసక్తికరమైన సినిమాను కూడా లైన్ లో పెట్టిన మాస్ రాజా.. థ్రిల్లింగ్ పోస్టర్!
మాస్ మహారాజా రవితేజ ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ఒక్కసారి సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే రాత్రి పగలు లేకుండా కష్ట పడుతూ ఉంటాడు. సోలోగా ఎలాంటి సపోర్ట్ లేకుండా పైకి వచ్చిన ఈ హీరో డిజాస్టర్స్ అందుకుంటున్న ప్రతి సారి కూడా మళ్లీ హార్డ్ వర్క్ చేస్తూ బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు. ప్రతిసారీ కూడా మాస్ మహారాజా తన టాలెంట్ ఏమిటో చాలా పవర్ ఫుల్ గా నిరూపించుకున్నాడు. రవితేజ సినిమాలు చేయడమే దండగా అని కామెంట్ చేసిన వారికి కూడా ఊహించని విధంగా క్రాక్ సినిమాతో కౌంటర్ ఇచ్చాడు.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లాక్ డౌన్ అనంతరం అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాగా కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేవలం ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా తర్వాత భారీ వసూళ్లను అందుకున్న సినిమాగా కూడా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అయితే క్రాక్ సినిమా అనంతరం మాస్ రాజ మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలని సినిమా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక తర్వాత ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఇక రవితేజ 70వ సినిమాపై కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చాడు. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్ పై అభిషేక్ నామా సంయుక్తంగా నిర్మించనున్న ఆ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. గతంలోనే సుధీర్ వర్మ చాలాసార్లు రవితేజతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశాడు. ఇక 2019లో రణరంగం సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వర్మ బాక్సాఫీసు వద్ద సరైన విజయాన్ని అందుకోలేక పోయారు. అయినప్పటికీ మాస్ రాజా రవితేజ అతనితో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఆ పోస్టర్ లో చారిత్రాత్మక నేపథ్యంలో కొన్ని దేవతల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. చూస్తుంటే దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాను సరికొత్త థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను నవంబర్ 5న ఉదయం 10:08కి విడుదల చేయనున్నారు. ఆ టైటిల్ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఇటీవల రవితేజ రామారావు సినిమాను కూడా మొదలు పెట్టాడు. శరత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.

అలాగే మంచి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న త్రినాథరావు నక్కినతో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ సినిమాకు టైటిల్ ను ధమాకా అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఆ మూడు సినిమాలతో పాటు మరొక సినిమాను కూడా లైన్ లో పెట్టడం విశేషం. మరి పవర్ఫుల్ లైనప్ తో సిద్ధమవుతున్న రవితేజ తన బాక్సాఫీస్ స్థాయిని ఇంకా ఎంత వరకు పెంచుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











