Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్న మాస్ మహారాజా.. చిన్న బడ్జెట్ లో భారీ ప్రయోగాలు
మాస్ మహారాజా రవితేజ అయితే మొత్తానికి 2021 సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. క్రాక్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలను అందించింది. మాస్ రాజా రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు సమాచారం. అయితే అందరూ హీరోలు సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ ను స్టార్ట్ చేస్తున్నట్లుగానే రవితేజ కూడా సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌజ్ ను స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు.
కేరళలో సన్నిలియోన్ హంగామా... శృంగారభరితంగా ఫోటోలతో...
క్రాక్ తో 50కోట్ల వసూళ్లు
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమా పక్కా మాస్ కమర్షియల్ కావడంతో మొదటిరోజు అభిమానుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. విడుదల ఆలస్యం అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికి ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రాక్ మొదటి రోజు కేవలం రెండు షోలతోనే హై రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 50కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.
రెమ్యునరేషన్ తగ్గింది..కానీ..
ఒక విధంగా క్రాక్ సినిమా రబితేజకు మరో లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. రవితేజ పనైపోయింది. ఇక సినిమాలు చేయడం కష్టమే అనే కామెంట్స్ వచ్చాయి. అందుకు కారణం.. మాస్ రాజా గత సినిమాలు కూడా డిజాస్టర్ కావడమే. మాస్ రాజా చివరగా రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అప్పటివరకు కూడా 7కోట్ల నుంచి 8కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నాడు.
ఆ సినిమాలతో.. బాగా తగ్గిన మార్కెట్
రాజా ది గ్రేట్ అనంతరం టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా వంటి సినిమాలు ఏ రేంజ్ లో ప్లాప్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఒకప్పుడు 30కోట్ల వరకు ఉంటే.. ఆ తరువాత 18కోట్లకు వచ్చేసింది. దీంతో రెమ్యునరేషన్ భారీగా తగ్గింది.
క్రాక్ ఇచ్చిన లాభం..
ఇక క్రాక్ విషయంలో రెమ్యునరేషన్ తీసుకోకుండా నైజాం ఏరియా హక్కులను తీసుకొని అక్కడ వచ్చిన షేర్స్ మొత్తం తనకే అనేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో క్రాక్ సినిమా 11కోట్లకు పైగా షేర్స్ ను అందించింది. ఒకవేళ రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటే కేవలం 5కోట్ల వరకే వచ్చి ఉండేవి.
సొంతంగా ప్రొడక్షన్ హౌజ్..
ఇక మాస్ రాజా సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ ను స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు. RT వర్క్స్ బ్యానర్ ను క్రియేట్ చేసి అందులో కంటెంట్ ఉన్న మినీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్త దర్శకులకు రవితేజ ఎక్కువగా ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడట. మరి మాస్ రాజా నిర్మించబోయే సినిమాలు ఎంతవరకు క్లిక్కవుతాయో చూడాలి.