రవితేజ నుంచి మైండ్ బ్లాక్ అయ్యే కాంబినేషన్.. నెవ్వర్ బిఫోర్ అనేలా..

మాస్ మహారాజ్ రవితేజ గోపీచంద్ మలినేని అంటే రెండు హిట్ సినిమాలు కనిపిస్తాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా డాన్ శీను బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాని తర్వాత 11 ఏళ్ళ తర్వాత క్రాక్ మూవీ చేశారు. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రవితేజ కెరియర్ లో సూపర్ హిట్ మూవీస్ లో ఒకటిగా క్రాక్ నిలిచిపోతుంది.

గోపీచంద్ మలినేని ఈ చిత్రం తర్వాత బాలయ్యతో వీరసింహారెడ్డి చేసి ఈ ఏడాది మరో హిట్ ని ఖాతాలో వేసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ లో వచ్చిన ఈ మూవీ వారికి మంచి లాభం అందించింది. దీంతో మైత్రీ నిర్మాతలు గోపీచంద్ మలినేనికి మరో ఛాన్స్ ఇచ్చారంట. ఇక ఈ దర్శకుడు మంచి కథ సిద్ధం చేసుకొని మరోసారి రవితేజతో చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు టాక్. మాస్ మహారాజ్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట.

Mass Maharaja Ravi Teja

ఇక ఈ సినిమాలో రవితేజకి జోడీగా యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటించబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ రవితేజతో ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ కాంబినేషన్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ హైపర్ యాక్టివ్ అనుకుంటే శ్రీలీల ధమాకా సినిమాలో అతనితో పోటీ పడి నటించింది. ఈ నేపథ్యంలో రవితేజకి జోడీగా గోపీచంద్ మలినేని శ్రీలీలని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడంట.

Mass Maharaja Ravi Teja

అమర్ అక్బర్ అంటోనీ లాంటి డిజాస్టర్ తర్వాత మైత్రీ నిర్మాతలతో రవితేజ ఈ సినిమా చేయనున్నాడు. అలాగే వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మైత్రీ, గోపి కాంబోలో రాబోతోన్న చిత్రం ఇదే. మొత్తానికి క్రేజీ కాంబినేషన్స్ తో ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందనేది చూడాలి. ఇక రవితేజ ప్రస్తుతం వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం దసరాకి రానుంది. దీని తర్వాత కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ మూవీ చేయనున్నాడు. దీంతో పాటు సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో ఒక చిత్రం చేయనున్నాడు. వీటి తర్వాత గోపీచంద్ మూవీ స్టార్ట్ అవుతుందేమో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X