ఒకేసారి ఆరు సినిమాలను లైన్ లో పెట్టిన రవితేజ.. లిస్టులో మరో మాస్ కాంబో!
మాస్ మహారాజు రవితేజ మరోసారి స్పీడ్ పెంచుతున్నాడు ఆ మధ్య వరుస పరాజయాలు ఎదురైనప్పటికీ కూడా ధమాకా సినిమాతో మళ్ళీ వెంటనే సెట్ అయిన రవితేజ ఇప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అప్పట్లో క్రాక్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయినా రవితేజ ఆ తర్వాత మళ్లీ వరుసగా మూడు అరాజయాలు ఎదుర్కొన్నాడు. అయితే మళ్లీ రవితేజ పని అయిపోయింది అని అతనికి అవకాశాలు రావడం కూడా కష్టమే అనే విధంగా నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి.
కానీ రవితేజ మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పటిలానే హార్డ్ వర్క్ ని నమ్ముకుని ముందుకు వెళ్లాడు. ఇక ఇప్పుడు ధమాకా సినిమా ఇచ్చిన బూస్ట్ తో అతను మరికొన్ని డిఫరెంట్ మాస్ యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఒక్కో సినిమాకు రవితేజ 20 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.

ముఖ్యంగా మిరపకాయ సినిమాతో హరీష్ శంకర్ తో అప్పట్లో మంచి సక్సెస్ అందుకున్న రవితేజ ఇప్పుడు మరోసారి అదే దర్శకుడితో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ రాబోతోంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ తో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఆ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇక సీతార ఎంటర్టైన్మెంట్స్ లో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. దిల్ రాజు కూడా ఇదివరకే రవితేజకు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించే అవకాశం ఉందట. ఇక కలర్ ఫోటో దర్శకుడు సందీప్ ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక లిస్టులో అయితే రవితేజ అభిషేక్ నామ ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడైతే ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ సినిమాలతో రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











