హోంబలెతో ప్రభాస్ మూడు సినిమాలు.. ఎన్ని వందల కోట్ల రెమ్యునరేషన్ అంటే?

ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర భారీ లెవెల్లో డిమాండ్ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మన తెలుగు హీరో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అనే చెప్పొచ్చు. ఎప్పుడైతే డార్లింగ్ హీరో బాహుబలి సినిమాలు చేసాడో అక్కడ నుంచి పాన్ ఇండియా సినిమాలకి ఫేస్ గా తాను మారిపోయాడు. కాగా అక్కడ నుంచి ప్రభాస్ రేంజ్ అండ్ మార్కెయ్ మారిపోయాయి.

దీనితో ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇండియన్ సినిమాని కనిపిస్తున్నాయి. దీనితో ప్రభాస్ తో సినిమాలు చేయాలి అని చాలా మంది నిర్మాతలు బాలీవుడ్, టాలీవుడ్ కన్నడ సినిమాలు నుంచి నిర్మాతలు లైన్ కడుతున్నారు. కాగా ప్రభాస్ ఇలా అనేక సినిమాలతో బిజీగా ఉన్నాడు.

massive 600 crore remuneration for prabhas with hombale films

మరి ఇంత డిమాండ్ ఉన్న ప్రభాస్ ఆ మధ్య ఒకో సినిమాకి 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనే వార్త ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. కానీ ఇపుడు హోంబలే నిర్మాణ సంస్థ ప్రభాస్ తో 600 కోట్ల డీల్ ని చేసుకున్నట్టుగా ఊహించని టాక్ వినిపిస్తుంది. ఇపుడు ఉన్న మూమెంట్ లో ఏ నిర్మాణ సంస్థకి ప్రభాస్ సినిమాకి ఒప్పుకున్నా వారు కేవలం నాన్ థియేట్రికల్ హక్కులతోనే తమ బడ్జెట్ లాగేస్తారు.

అలాంటిది ఒకే నిర్మాణ సంస్థకి మూడు సినిమాలు వరుసగా ఇచ్చాడు అంటే అది వాళ్లకి జాక్ పాట్ అని చెప్పొచ్చు. కాగా ఆ నిర్మాణ సంస్థే కన్నడ సంస్థ హోంబలె ఫిలిమ్స్ కాగా వీరితో ఆల్రెడీ ప్రభాస్ సలార్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇది కాకుండా మొత్తం మూడు సినిమాలు ఇపుడు ఓకే చేసుకోగా ఈ మూడు సినిమాలకి ప్రభాస్ ఏకంగా 600 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.

అంటే ఒకో సినిమాకి 200 కోట్ల పారితోషికం డార్లింగ్ అందుకుంటున్నాడని చెప్పాలి. అయితే ఈ మొత్తం డీల్ ని హోంబలే సంస్థ ప్రభాస్ తో ఒకేసారి లాక్ చేసేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇలా కేవలం రెమ్యునరేషన్ కే ప్రభాస్ ఈ తరహాలో ఉందంటే తన మార్కెట్ పట్ల నిర్మాతల్లో నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

massive 600 crore remuneration for prabhas with hombale films

కాగా ఇపుడు ప్రభాస్ ఆ మూడు చిత్రాలు వరుసగా 2026 నుంచి 2028 వరకు ప్లాన్ చేసుకోగా ఈ సినిమాల్లో ఒకటి సలార్ సినిమాకి సీక్వెల్ సలార్ శౌర్యంగ పర్వం ఒకటి కాగా ఇది కాకుండా సెన్సేషనల్ దర్శకులు ప్రశాంత్ వర్మ అలాగే లోకేష్ కనగరాజ్ లతో మిగతా రెండు సినిమాలు ఉంటాయని క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి.

అలాగే ఈ ఇద్దరిలో ఓ సినిమా అయితే అసలు ఊహించని సబ్జెక్టు అంటూ కూడా పుకార్లు ఉన్నాయి. మరి చూడాలి ప్రభాస్ నుంచి ఏ రేంజ్ సినిమాలు రానున్న నాలుగేళ్లలో ఉంటాయో అనేది. మరి ఇవి కూడా కాకుండా మరికొన్ని సినిమాలు ఇతర దర్శకులతో ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Read more about: prabhas salaar 2 prashanth neel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X