Abhinav Gomatam: ఆమెతో పీకల్లోతు ప్రేమలో అభినవ్ గోమఠం.. లైవ్‌లోనే పెళ్లి ప్రపోజల్!

అభినవ్ గోమఠం.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తనదైన మాటతీరుతో అందరినీ మెప్పించగల సత్తా ఉన్న ఈయన తాజాగా ఓ అద్భుతమైన సినిమాతో వచ్చాడు. మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా చిత్రంలో ప్రేక్షకులు అంతా కడుపుబ్బా నవ్వేలా చేశాడు. అలాగే సేవ్ ది టైగర్స్ సీజన్ 2లోనూ అదిరిపేయే పంచులతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. అయితే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూకి వచ్చి తన ప్రియురాలి గురించి షాకింగ్ కామెంట్లు చేశాడు. లైవ్ లోనే ఓ అమ్మాయితో పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.

హైదరాబాద్ లో పుట్టిన అభినవ్.. గుజరాత్ లో పెరిగాడు. తండ్రి ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగి కావడంతో ఆయన విద్యాభ్యాసం వివిధ ప్రాంతాలలో సాగింది. ఇలా బీటెక్ చేస్తున్న సమయంలోనే సినిమాలప ఉన్న ఇష్టంతో యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. ఇంజినీరింగ్‌ తరువాత కొంతకాలం డెల్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి ఉద్యోగాన్ని వదిలేసి మరీ వచ్చి సినిమాలు చేశాడు. ముందుగా షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈయన మైనే ప్యార్ కియా సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది చిత్రంలో కౌశిక్ గా కనిపించి విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు.

Masth Shades Unnay Ra Movie Hero Abhinav Gomatam Reveal Her Girl Friend Name Check Details

ఆ తర్వాత నుంచి వరసుగా సినిమాలు చేస్తూ వస్తున్న ఈయనకు, ఈయన కామెడీకీ పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ముఖ్యంగా జగన్నాటకం, మళ్లీ రావా, ఫలక్ నుమా దాస్, సీత, మీకు మాత్రమే చెప్తా, రంగ్ దే, ఇచ్చట వాహనములు నిలపరాదు, శ్యామ్ సింగరాయ్, విరూపాక్ష, గూఢచారి, గాండీవధారి అర్జున, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి చిత్రాలతో సైడ్ రోల్స్ చేశాడు. కానీ కిస్మత్, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా సినిమాల్లో మాత్ర లీడ్ రోల్ లో కనిపించి మరోసారి సినీ ప్రియులను మెస్మరైజ్ చేశాడు.

తాజాగా అభినవ్ గోమఠం.. దావత్ అనే షోకు వచ్చాడు. రీతూ చౌదరి యాంకరింగ్ చేసే ఈ షోలో అభినవ్ చాలా ప్రశ్నలకే సమాధానాలు చెప్పాడు. ముఖ్యంగా రీతూ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడగ్గా.. నువ్వు రెడీయేనా అన్నాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. ఆమె రెడీ అంటే ఈయన ఆమెను పెళ్లి చేసుకుంటాడా అని కామెంట్లు రూపంలో ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అభినవ్.. ఆమెను అడిగిన తీరు చూసి నోరెళ్లబెడుతున్నారు. కానీ ఈ ప్రశ్న విన్న రీతూ చౌదరి మాత్రం అదేం లేదని చెప్పుకొచ్చింది.

ఏదో ఊరికే అడిగానని రీతూ చెప్పగా.. ఊరికే ఎందుకు అడుగుతావ్.. నా పెళ్లి గురించి నీకు ఎందుకు అంటూ అన్నాడు. దీంతో అంతా పగలబడి నవ్వారు. ఇక ఆ తర్వాత రీతూ అడిగిన ప్రశ్నలకు అభినవ్ చెప్పిన సమాధానాలు అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. మీరు కూడా ఓసారి ఈ షోను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X