రామ్ చరణ్‌కు మెగా సపోర్ట్.. కుటుంబం అంతా ఒక్కటై..

Recommended Video

Mega Family Supports Ram Charan Instagram Entry

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవల సోషల్ మీడియా మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంటరైన విషయం తెలిసిందే. అభిమానులు, సన్నిహితులతో నిత్యం టచ్‌లో ఉండేందు కోసం చెర్రీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 'always ram charan' పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టాడు ఈ మెగా హీరో. దీంతో అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని ఫ్యాన్ పేజీలలో షేర్ చేసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

ఉపాసనతో మొదలు

ఉపాసనతో మొదలు

రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంటరవడం పట్ల మెగా ఫ్యామిలీలోని హీరోలతో పాటు కుటుంబ సభ్యులు తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాడన్న విషయం అందరికీ తెలిసిందే అయినా.. రెండు రోజుల క్రితం అతడే స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించాడు. ఈ మేరకు స్విమ్మింగ్ పూల్‌లో నుంచి మాట్లాడుతున్న ఓ వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మెగా ఫ్యామిలీ సపోర్ట్

మెగా ఫ్యామిలీ సపోర్ట్

చెర్రీ ఇన్‌స్టాలోకి ఎంటరైన వెంటనే మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఫాలో అవడం ప్రారంభించాడు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే వేదికపై చరణ్‌కు వెల్‌కమ్ చెప్పాడు. అంతేకాదు, ఇకపై చరణ్ ‘‘Instag'ram'' అంటూ క్యాప్షన్ పెట్టాడు. అతడితో పాటు భార్య స్నేహా రెడ్డి సైతం ఇదే తరహా మెసేజ్ పెట్టింది. వీరితో పాటు నిహారిక, వరణ్ తేజ్, అల్లు బాబీ కూడా చెర్రీకి వెల్‌కమ్ చెప్పారు. అలాగే, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ సైతం చరణ్‌ను ఫాలో అవుతున్నాడు.

విపరీతంగా పెరిగిపోతున్న ఫాలోవర్స్

విపరీతంగా పెరిగిపోతున్న ఫాలోవర్స్

చెర్రీ ఇన్‌స్టాలోకి ఎంటరైనప్పటి నుంచి గంటగంట‌కు ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు. ఆయన ఫ్యాన్స్ ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడంతో ఇప్పటికే రామ్ చరణ్ ఫాలోవర్స్ ఇప్పటికే ఐదు లక్షలకు పైగా పెరిగిపోయారు. ఫ్యాన్స్‌తో పాటు సెలెబ్రిటీలు కూడా చరణ్‌ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతానికి రామ్ చరణ్‌ను ఫాలో అవుతోన్న వారిలో చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. అయితే, చెర్రీ మాత్రం ఎవరీ ఫాలో అవడం లేదు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘RRR'లో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో చరణ్ అల్లూరు సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కాబోతోంది. అలాగే, తన తండ్రి చిరంజీవి హీరోగా చేస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి'ని చరణే నిర్మిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X