అల్లు అర్జున్ నీ పతనం మొదలు.. ఐకాన్ స్టార్‌పై మెగా ఫ్యాన్ ఫైర్

మెగా ఫ్యామిలీలో పైకి కనిపించినట్లుగా అందరూ ఒక్కటి కాదనే విషయం అల్లు అర్జున్ ఎపిసోడ్‌తో బయటపడింది. ఇప్పుడు మెగా హీరోల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇదంతా బన్నీ పుణ్యమేనని హార్డ్ కోర్ మెగా అభిమానుల మాట. అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్ కాంట్రవర్సీ నుంచి అల్లు అర్జున్‌ని మెగా ఫ్యాన్స్‌ .. మెగా ఫ్యామిలీలోని వ్యక్తిగా చూడటం మానేశారు. ఒకానొక ఈవెంట్‌లో అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటే నాకు ఆర్మీ ఉందని వ్యాఖ్యానించాడు. ఈ మాటతో మెగా ఫ్యాన్స్‌కి ఎక్కడో కాలింది. అంతే అల్లు అర్జున్‌పై ఉన్న కాస్త గౌరవం కూడా వదిలిపెట్టేశారు.

ఈ పరిణామాలు ఇలా సాగుతూ ఉండగా తాజా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టించాయి. ఎన్నికల ప్రచార గడువు కొద్దిగంటల్లో ముగుస్తుందనగా తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్ధతు పలికేందుకు బన్నీ తన భార్య స్నేహారెడ్డితో కలిసి నంద్యాలలో దిగారు. శిల్పా రవిని గెలిపించాలని తన అభిమానులను కోరారు. ఈ ఘటనతో మెగా, పవన్ ఫ్యాన్స్‌కి చిర్రెత్తుకొచ్చింది.

mega fan made sensational comments on icon star allu arjun over his speech at maruthi nagar Subramanyam pre release event

సొంత మేనమామ పవన్ కళ్యాణ్ ‌కష్టపడుతుంటే ఓ చిన్న ట్వీట్‌తో సరిపెట్టి.. ఫ్రెండ్ వద్దకు స్వయంగా వెళ్లడాన్ని అది కూడా జనసేనాని బద్ధ వ్యతిరేకి జగన్‌ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికా అంటూ ట్రోలింగ్ చేశారు. తర్వాత మెగా మేనల్లుడు సాయిథరం తేజ్ .. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డిని తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో వారిని ఆన్‌ఫాలో చేయడం దుమారం రేపింది.

పవన్ గెలిచిన తర్వాత ఆయనకు విషెస్ తెలియజేస్తూ అల్లు అర్జున్ ఓ ట్వీట్‌తో సరిపెట్టాడు తప్పించి.. వ్యక్తిగతంగా కలవడం గానీ, ఆఖరికి చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. మెగా వర్సెస్ అల్లు అర్జున్ అనేది కేవలం మీడియా సృష్టేనని కొందరు చెబుతున్నారు. అయితే రెండు కుటుంబాలకు అత్యంత సన్నిహితుడైన నిర్మాత బన్నీ వాసు మాత్రం అల్లు - మెగా కుటుంబాల మధ్య చిన్న డిస్ట్రబెన్స్ ఉందన్నట్లుగా మాట్లాడారు.

ఇలాంటి దశలో రావు రమేశ్ హీరోగా నటించిన మారుతీ నగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మనసుకు ఇష్టమైన వారికి మన సపోర్ట్‌ను చూపించాలి, నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అంటూ వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీని ఉద్దేశించే అల్లు అర్జున్ ఈ కామెంట్ చేశారంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈరోజు చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ ఇంద్ర 4కే రిలీజ్ సందర్భంగా ఓ మెగా ఫ్యాన్ థియేటర్‌లో సినిమా చూసి బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నూటికి 1000 శాతం కావాలనే బన్నీ కాంట్రవర్సీగా మాట్లాడారని.. చెట్టు కింద పెరిగి, చెట్టు కాయలు తిని, చెట్టునే నరకడం , నరకాలనుకోవాలనే స్వభావం మంచిది కాదన్నారు. అది మా వంశంలోనే లేదు, ఎప్పుడూ ఎవరికీ నేర్పలేదని.. అది చాలా తప్పని కామెంట్ చేశాడు. అది నీ పతనానికే కారణమవుతుంది.. గుర్తు పెట్టుకో , అది ఎవరో ప్రతి ఒక్కరికీ తెలుసునని ఆ అభిమాని తెలిపాడు. ఇంద్రలో శివాజీ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఆ పేరును థియేటర్‌లోని ప్రతి ఒక్కరు .. మేనల్లుడు, మేనల్లుడు అని అరిచారని ఆ వ్యక్తి చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియోను మెగా అభిమానులు వైరల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X