రామ్ చరణ్ బర్త్ డే కోసం బిగ్ ప్లాన్.. RRR హడావుడిలో ఆ రోజు జాతరే!
మెగా అభిమానులకు రెండు పండుగలు ఒకేసారి రాబోతున్నాయి అనే చెప్పాలి. RRR సినిమా ఈనెల 25వ తేదీన విడుదల కాబోతుండగా.. మార్చి 27వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజును కూడా జరుపుకోబోతున్నారు. ఇక ఈ బర్త్ డే వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని అభిమానులు ముందుగానే ఒక ప్లాన్ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇక ముందుగా జూనియర్ ఎన్టీఆర్ తో రామ్ చరణ్ కలిసి నటించిన RRR సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా మరొక హీరో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఇద్దరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి అజయ్ దేవగన్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో అలరించబోతున్నాడు. స్టార్ కాస్టింగ్ తోనే దర్శకుడు రాజమౌళి ఒక్క సారిగా ఈ సినిమాపై అంచనాలు స్థాయిని అమాంతంగా పెంచేశారు.

నిర్మాత డివివి దానయ్య ఈ సినిమా కోసం 500 కోట్లు ఖర్చు చేసే నిర్మించడం జరిగింది. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మెగా నందమూరి కాంబినేషన్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే RRR సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతోంది. ఇక తప్పకుండా RRR సినిమా అయితే మంచి విజయాన్ని అందుకుంటుంది అని అర్థమైంది. అయితే ఆ హడావిడిలోనే రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలను కూడా గ్రాండ్ గా నిర్వహించాలి అని అభిమానులు మరొక ప్లాన్ వేశారు.
మార్చి 27వ తేదీన రామ్ చరణ్ తేజ్ 37వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాలి అని అనుకుంటున్నారు. ఈ వేడుకపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. రామ్ చరణ్ యువశక్తి అనే అభిమానుల సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకకు రెండు రాష్ట్రాల నుంచి మెగా అభిమాన సంఘాల నాయకులు రాబోతున్నారు. అంతేకాకుండా మెగా హీరోలు కూడా పాల్గొన్న పోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ వేడుక ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.
ఇక మరోవైపు రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











