వైసీపీ అభ్యర్థికి ఐకాన్ స్టార్ మద్దతు.. అల్లు అర్జున్‌పై మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్

మెగా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటనలో తన మిత్రుడు శిల్ప రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడంపై అభిమానుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. అయితే కొందరు మాత్రం అల్లు అర్జున్ అధికార వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంపై అసంతృప్తిని, తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అభిమానుల స్పందన తీరు, అలాగే అల్లు అర్జున్ వివరణ ఇచ్చిన తీరు విషయంలోకి వెళితే..

ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకొంటున్న సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత సమయం తీసుకొని తన భార్య స్నేహారెడ్డితో కలిసి కర్నూలుకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఆయనకు అక్కడి ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కిక్కిరిసిన అభిమానులు, జనసందోహం మధ్య ఇంటిలోకి చేరుకొన్నారు.

Mega Fans trolling Allu Arjun for supporting YSRCP Nandyala Candidate Shilpa RaviChandra Kishore Reddy

శిల్పా రవి గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. శిల్పా రవి నాకు మంచి మిత్రుడు. నాకు పార్టీలతో సంబంధం లేదు. కేవలం తనతో ఉన్న వ్యక్తిగత స్నేహంతోనే నేను నంద్యాలకు వచ్చాను. ఎమ్మెల్యే శిల్పా రవి వద్దన్నా కూడా నేనే తనను అభినందించడానికి విషెస్ చెప్పడానికి నంద్యాల వచ్చాను, నా మనసుకు నచ్చినోళ్లు ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తాను అని అన్నారు.

శిల్పా రవి ఫ్యామిలీతో నాకు, నా కుటుంబానికి ఉన్న అనుబంధమే నన్ను నంద్యాలకు వచ్చేలా చేసింది. గత ఎన్నికల్లో ట్వీట్ చేసి విజయం సాధించాలని కోరుకొన్నాను. కానీ అది సరిపోదని అనిపించింది. అందుకే ఆయన కోసం వచ్చాను. శిల్పా రవి మంచి మెజార్టీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నాను. రవికి మాటిచ్చాను. శిల్పా రవికున్న మంచి మనస్తత్వమే నన్ను ఇంత దూరం వచ్చేలా చేసింది అని తెలిపారు.

అయితే శిల్పా రవి ప్రస్తుతం కూటమి అభ్యర్తి నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. జనసేన, బీజేపీ పార్టీ బలపరుస్తున్న ఫారుక్‌తో నువ్వా నేనా అనే విధంగా పోటీ ఉండటంతో అల్లు అర్జున్ ప్రచారం బరిలోకి దిగినట్టు తెలుస్తున్నది. తన అభిమానుల మద్దతు ఉండేలా పిలుపునిచ్చారు.

అయితే అల్లు అర్జున్ ఏపీలో వైసీపీకి మద్దతు ఇవ్వడంపై మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఏమిటి అనే ప్రశ్న మొదలైంది. అయితే ఐకాన్ స్టార్ తీసుకొన్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ఓపెన్‌గానే విమర్శలు గుప్పిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X