Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మెగా క్రిస్టమస్ పార్టీ.. మెగా యువ హీరోలందరు ఒకే ఫ్రేమ్ లో.. మిస్సయ్యింది అతనొక్కడే!
మెగా ఫ్యామిలీలో హీరోలు బయట ఎంత స్టార్ డమ్ తో ఉన్నప్పటికీ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా సింపుల్ గా ఉంటారని అందరికి తెలిసిన విషయమే. కుల మతాలతో సంబంధం లేకుండా దాదాపు అన్ని రకాల పండగలను కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఇటీవల క్రిస్మస్ వేడుకలను కూడా మెగా హీరోలు అందరూ కూడా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మెగా హీరోలు అందరూ కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపించిన ఫోటో ప్రస్తుతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది అయితే అందులో మరొకరు ఉండి ఉంటే చాలా బాగుండేది అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

వారికంటూ ఒక గుర్తింపు
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోలకు అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత వచ్చిన వారందరూ కూడా వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత వరకు సొంతంగా జనాల్లోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒకే ఫ్రేమ్ లో మెగా కజిన్స్
ఈసారి కూడా రామ్ చరణ్ తేజ్ అల్లు అర్జున్ ఇలా అందరూ కలిసి ప్రత్యేకమైన పండగలను సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా క్రిస్టమస్ వేడుకలను మెగా హీరోలు అందరూ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారు. చాలా మంది మెగా అభిమానులు చూడటానికి ఇష్టపడే ఒక అందమైన చిత్రం ఏమిటంటే, మెగా కజిన్స్ అందరూ సందర్భానుసారంగా ఏకమవుతున్నారు.

మెగా హీరోలు..
ఇక పండగలకి ఎలాగోలా మెగా హీరోలు, మెగా కజిన్స్ ఎక్కడో ఒకచోట కలుసుకుని కలిసి ఫోటో దిగేలా చూసుకుంటున్నారు. ఇక క్రిస్మస్ పార్టీ రోజు కూడా మరోసారి అందరూ ఏకమయ్యారు. అల్లు అర్జున్ రామ్ చరణ్ కలిసి పోజులివ్వగా వారితో వరుణ్ తేజ్ సాయిధరమ్, వైష్ణవ్ సహా దాదాపు అందరు మెగా హీరోలు తమ ఇతర కజిన్స్, నిహారిక, సుస్మిత మరియు శ్రీజ మరియు ఇతరులతో కలిశారు.

అకిరా కూడా ఉండాల్సింది..
అయితే పవన్ కళ్యాణ్ పిల్లలు కూడా ఈ ఫ్రేమ్ లో ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా అకిరా నందన్ మిస్ అయ్యాడు అని అంటున్నారు. మెగా కజిన్స్ తో చాలా వరకు అకిరా క్లోజ్ గానే ఉంటాడు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో చాలా ఫ్రెండ్లిగా ఉంటాడని అర్ధమయ్యింది. ఇక ఇలాంటి ఫెస్టివల్స్ లో అతను ఉండి ఉంటే ఫ్రేమ్ మరోలా ఉండేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

క్రమశిక్షణతో..
ఇక ఈ ఫొటోలో శ్రీజ భర్త కళ్యాణదేవ్ మరియు అల్లు శిరీష్ కూడా లేరు. గతంలో మెగా కజిన్స్ దీపావళి పండగలో ఇదే విధంగా కలిసి పోజులిచ్చారు. కుటుంబ సభ్యులు ఐకమత్యంతో ఎలా నిలబడాలి అనేదానికి ఇదొక ఉదాహరణ అని అంటున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అంకితభావం, క్రమశిక్షణ మరియు సంకల్పబలం ఉంటే ఒకే రంగంలో అయినా విజయం సాధించగలరని మెగా హీరోలు నిరూపించారు.