చాలా రోజుల తరువాత తన కుటుంబానికి దగ్గరైన కళ్యాణ్ దేవ్.. కరోనా పరీక్షల్లో నెగిటివ్

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ అలా బాధ్యత గల పౌరుడిగా ఒక మంచి పనితో తానేంటో నిరూపించుకున్నాడు. చాలా రోజుల తరువాత ఈ యువ హీరో తన కుటుంబానికి దగ్గరయ్యాడు. అలాగే ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు కూడా చేయించుకున్నారు. నెగిటివ్ అని వచ్చిన తరువాతే కళ్యాణ్ తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. గత నెల కళ్యాణ్ దేవ్ ఎక్కువగా షూటింగ్ పనులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఆ సినిమా కోసం..

ఆ సినిమా కోసం..

లాక్ డౌన్ ఎత్తివేయగానే తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది అత్యంత జాగ్రత్తగా ఉంటూ షూటింగ్స్ పూర్తి చేసుకోగా మరికొందరు కరోనాను లైట్ తీసుకోవడంతో చివరికి ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. ఇక గత నెల కళ్యాణ్ దేవ్ కూడా తన రెండవ సినిమా సూపర్ మచి షూటింగ్ కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళాడు.

కుటుంబానికి దూరంగా ఉంటూ..

కుటుంబానికి దూరంగా ఉంటూ..

అయితే షూటింగ్ ఉన్నన్ని రోజులు కూడా కళ్యాణ్ తన కుటుంబానికి దూరంగానే ఉన్నాడు. ఈ విషయంపై కళ్యాణ్ దేవ్ ముందుగానే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కరోనా భయం వల్ల ఇంట్లో వాళ్లకు చాలా దూరంగా ఉండాల్సి వస్తోందని ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఉదయం బయటకు వెళితే సాయంత్రం ఎప్పుడో గాని బయటకు రాను అందుకే నా వాళ్లకు దూరంగా ఉన్నానని చెప్పాడు..

కరోనా టెస్ట్ తరువాత..

కరోనా టెస్ట్ తరువాత..

ఇక షూటింగ్ పనులు ముగిసిన తరువాత కరోనా వైరస్ టెస్టులు చేయించుకున్నారు కళ్యాణ్ దేవ్. అయితే ఆ పరీక్షల్లో నెగిటివ్ అని రిపోర్ట్స్ రావడంతో చాలా రోజుల తరువాత మళ్ళీ తన కుటుంబానికి దగ్గరయ్యాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఒక స్పెషల్ ఫోటోని కూడా షేర్ చేశారు. తనకు తానే ఇన్ని రోజులు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నానని ఇక ఎలాంటి వైరస్ లేదని తెలియడంతో మళ్ళీ ఫ్యామిలీని కలుసుకున్నట్లు చెప్పాడు.

Recommended Video

Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
 అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు

అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు

ఇక తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు చాలా కృతజ్ఞతలు అంటూ అభిమానులకు కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక.కళ్యాణ్ దేవ్ నెక్స్ట్ సూపర్ మచి అనే సినిమాతో రాబోతున్నాడు. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాలో రచిత రామ్ హీరోయిన్ గా నటిస్తుండగా పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X