ఆమెతో డేటింగ్‌లో ఉన్నానంటూ షాకిచ్చిన మెగా హీరో: పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసిన సాయి ధరమ్

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన వారిలో సాయి ధరమ్ తేజ్ ఒకడు. అందరిలా అతడి ఎంట్రీ రిచ్‌గా జరగలేదు. అనూహ్య పరిణామాల నడుమ మొదటి సినిమా ఆగిపోగా.. రెండో సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యాడు. ఆరంభంలోనే కొన్ని విజయాలను అందుకున్న అతడు.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలో దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై అతడు స్పందించాడు. వివరాల్లోకి వెళితే...

వాలంటైన్ రోజున ప్రియుడితో పెర్లీ ఫుల్ రొమాన్స్.. తన్మయత్వంలో మునిగిన ప్రేమ జంట

సాదాసీదా ఎంట్రీ.. సుప్రీమ్ హీరోగా మారాడు

సాదాసీదా ఎంట్రీ.. సుప్రీమ్ హీరోగా మారాడు

టాలెంటెడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన 'రేయ్'తో పరిచయం అవ్వాల్సి ఉన్నా.. అది అనివార్య కారణాలతో వాయిదా పడడంతో 'పిల్లా నువ్వు లేని జీవితం' ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభంలోనే 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్' వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్న మెగా హీరో.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

వరుస హిట్లతో దూకుడు... లాక్‌డౌన్ తర్వాత

వరుస హిట్లతో దూకుడు... లాక్‌డౌన్ తర్వాత

కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్న తరుణంలో సాయి ధరమ్ తేజ్ 'చిత్రలహరి'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. దీని తర్వాత మారుతి డైరెక్షన్‌లో వచ్చిన 'ప్రతిరోజూ పండగే'తో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఇక, ఇటీవలే 'సోలో బ్రతుకే సో బెటర్'తో వరుసగా మూడో హిట్‌ను అందుకున్నాడు.

హాట్ టాపిక్‌గా తేజ్ పెళ్లి.. ఇప్పుడు మరోసారి

హాట్ టాపిక్‌గా తేజ్ పెళ్లి.. ఇప్పుడు మరోసారి

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్లుగా ఉన్న హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకడు. అందుకే అతడి వివాహం గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే, ఈ సారి మాత్రం ఈ సుప్రీమ్ హీరో నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని సమాచారం.

ఆ నెలలోనే వివాహం అంటూ పుకార్లు షికారు

ఆ నెలలోనే వివాహం అంటూ పుకార్లు షికారు

సాయి ధరమ్ తేజ్ వివాహానికి రంగం సిద్ధం అయినట్లు జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతడి పెళ్లి జరగబోయే తేదీ గురించి కూడా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. సాయి ధరమ్ తేజ్ పెళ్లి మే నెలలో జరగబోతుందట. వాస్తవానికి అంతకు ముందే ఈ వేడుక జరగాలని అనుకున్నా.. మంచి ముహూర్తాలు లేవని అలా డిసైడ్ అయ్యారట.

ఆమెతో డేటింగ్‌లో ఉన్నానంటూ షాకిచ్చాడు

ఆమెతో డేటింగ్‌లో ఉన్నానంటూ షాకిచ్చాడు

మెగా ఫ్యామిలీ నుంచి హీరో పరిచయం అవుతోన్న నేపథ్యంలో ఆ కుటుంబానికి చెందిన హీరోలు నిహారికతో కలిసి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. దీనికి 'ఉప్పెన' హీరో వైష్ణవ్ తేజ్‌తో పాటు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను ప్రస్తుతం ఓ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నానంటూ చెప్పి షాకిచ్చాడు సాయి ధరమ్ తేజ్.

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసిన సాయి ధరమ్

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసిన సాయి ధరమ్

సాయి ధరమ్ తేజ్ డేటింగ్ గురించి చెప్పగానే అక్కడున్న వాళ్లంతా షాకయ్యారు. దీనిపై క్లారిటీ ఇస్తూ.. 'మరి లేకపోతే ఏంటి? నేను డేటింగ్‌లో ఉండడం కాదు.. మే నెలలో నా పెళ్లి కూడా జరుగుతుందంట' అంటూ ఫన్నీగా తనపై వార్తలు రాసిన వాళ్లందరిపై సెటైర్లు వేశాడీ మెగా హీరో. ఇలా పరోక్షంగా అవన్నీ వట్టి పుకార్లేనని తేల్చేశాడతను. దీంతో ఆ వార్తలు ఆగుతాయేమో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X