Sai Dharam Tej: ఆ హీరోయిన్ ప్రేమలో మునిగిపోయిన సాయి ధరమ్ తేజ్.. ఆమెతోనే రొమాన్స్ చేస్తా అంటూ..!
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్... మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన శైలీలో సినిమాలు చేస్తూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ కుర్ర హీరో.. ఓ హీరోయిన్ ప్రేమలో మునిగి తేలుతున్నాడు. అంతే కాదు.. ఆమెతో ఛాన్స్ వస్తే రొమాన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. తాజా ఆయన ఓ చిట్ చాట్ నిర్వహించాడు. అందులో ఆయన తన ప్రేమ గురించి చెప్పుకువచ్చాడు. ఆ హీరోయిన్ ఛాన్స్ ఇస్తే.. కలిసి సినిమా చేయాలి ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. ఇండస్ట్రీకి పరిచయం అయ్యి 9ఏళ్లు దాటింది. ఇక ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. విరూపాక్ష సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన తేజు.. ఇటీవల బ్రో అనే సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. తన మావయ్య పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇక తేజు యాక్టింగ్ కూడా ఆకట్టుకుంది.

ఇక యాక్సిడెండ్ తర్వాత సాయి ధరమ్ తేజ్... సినిమాలు కాస్త నెమ్మదించాయి. సాయి తేజ్ ప్రస్తుతం సత్య అనే షార్ట్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే... సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 9ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించాడు.
ఇక ఈ చిట్ చాట్ సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. సాయి ధరమ్ తేజ్ క్రష్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా సార్లు ఆ హీరోయిన్ ప్రేమలో ఉన్నట్లు చెప్పుకువచ్చాడు. ఆమె ఎవరో కాదు.. సమంత రుత్ ప్రభు. ఈ భామ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎన్నో సార్లు మీడియా ముఖంగా ఆయన ప్రేమను బయటపెట్టాడు సాయి ధరమ్ తేజ్. ఇక ఈ హీరోయిన్ గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తేజు.

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ... 'ఏ మాయ చేసావే'లోని జెస్సీ పాత్ర సినీ ప్రేమికుల జ్ఞాపకంలో నిలిచిపోయింది. ఆ రొమాంటిక్ క్లాసిక్‌తో యువకుల హృదయాలను దోచుకుంది సమంత. అలా నా మనసు కూడా దోచుకుంది సామ్. ఆమెను ఇష్టపడే వారిలో నేను ఒక్కడిని..అంటూ చెప్పుకువచ్చారు. ఇక ఆమెతో ఎప్పుడు నటిస్తారు అని అడగడంతో... ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పుకువచ్చాడు.
సమంత అంటే చాలా ఇష్టం.. ఆమెతో కలిసి చేయాలని కోరుకుంటున్నా.. ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా.. వీలైతే తనతో రొమాంటిక్ లవ్ స్టోరీ చేయాలని ఉంది.. మా జోడి చూడటానికి కూడా బాగుంటుంది.. అంటూ సమంత గురించి మనసులో మాట బయటపెట్టాడు తేజు. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ జంట ఫ్యూచర్ లో కలిసి చేస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











