ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే.. తమ్ముడి కోసం మరో కథ సెట్ చేసిన మెగా హీరో
మెగా ఫ్యామిలి నుంచి త్వరలో హీరోగా పరిచయం కాబోతున్న యువ నటుడు వైష్ణవ్ తేజ్. సుకుమార్ ప్రొడక్షన్ లో రూపొందిన ఉప్పెన అనే ఆ సినిమా మొన్న సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోని విధంగా లాక్ డౌన్ దెబ్బకు ఆలస్యంగా రిలీజ్ కాబోతోంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఇంతవరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు.
అయితే మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే వైష్ణవ్ తేజ్ కోసం మరికొన్ని ప్రాజెక్టులు సెట్టయినట్లు తెలుస్తోంది. ముందుగా అన్నయ్య సాయి ధరమ్ తేజ్ మరొక ప్రేమ కథను వైష్ణవ్ తేజ్ కోసం సెట్ చేసినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కంటే ముందు నుంచే ఆ కథపై చర్చలు జరుపుతున్నారట. కానీ మొదటి సినిమా రిలీజ్ కాకముందే హడావుడిగా రెండో సినిమాతో అప్పుడే హడావుడి చేయడం కరెక్ట్ కాదని పెండింగ్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

కొత్త దర్శకుడు చెప్పిన ఆ కథ అయితే ముందుగా సాయి ధరమ్ తేజ్ చేయాలని అనుకున్నాడట. కానీ కథ తమ్ముడికి అయితేనే కరెక్ట్ గా సెట్టవుతుందని ఆ తరువాత దర్శకుడి మనసు మర్చినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఉప్పెన సినిమా కొత్త రిలీజ్ డేట్ పై వచ్చే నెలలో క్లారిటీ ఇవ్వాలని సుకుమార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











