సాయిధరమ్ తేజ్ తిరిగొచ్చాడు.. అక్టోబర్‌లో ప్రారంభం!
సాయిధరమ్ తేజ్ చివరగా నటించిన చిత్రం తేజ్ ఐ లవ్ యూ. తేజు, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. కొంత కాలంగా సాయిధరమ్ తేజ్ కు వరుసగా పరాజయాలు ఎదురవుతోనే ఉన్నాయి. దీనితో సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రంపై కాస్త ఎక్కువగా శ్రద్ద తీసుకుంటున్నాడు. తేజ్ ఐ లవ్ యూ చిత్రం తరువాత సాయిధరమ్ తేజ్ తన లుక్కు మార్చుకునేందుకు, ఫిట్ నెస్ ట్రైనింగ్ కోసం యూఎస్ వెళ్లిన సంగతి తెలిసిందే.
మూడు నెలల ఫిజికల్ ట్రైనింగ్ లో పాల్గొన్న సాయిధరమ్ తేజ్ ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్నాడు. లుక్ బయటకు రాలేదు కానీ పొడవాటి హెయిర్, గడ్డంతో సాయిధరమ్ తేజ్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో కిషోర్ తిరుమల దర్శత్వంలో తేజు కొత్త సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రం కోసమే తేజు సరికొత్త లుక్, బాడీ లాంగ్వేజ్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్ లో తేజు, కిషోర్ తిరుమల మూవీ లాంచ్ సందర్భంగా అతడి కొత్త లుక్ బయట పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతమవుతున్న తేజు ఇకపై తప్పులు జరగకూడదని భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











