నానితో పోటీ వద్దని.. పెద్ద సినిమాను వాయిదా వేసుకున్న మెగా హీరో?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త సినిమాలు విడుదలపై అనేక రకాల అనుమానాలు వెలువడుతున్నాయి. మొత్తానికి ఈ డిసెంబర్ నుంచి పెద్ద సినిమాలు వరుసగా థియేటర్ లోకి రాబోతున్నాయి అని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కానీ ప్రస్తుతం విడుదలపై అయితే నిర్మాతలు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా సినిమా హాల్స్ మళ్ళీ యధావిధిగా కొనసాగుతాయని అఖండ సినిమాతో కొంత ధైర్యం అయితే వచ్చింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా బాక్సాఫీసు వద్ద ఏ స్థాయిలో ఓపెనింగ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ధైర్యంతోనే మిగతా హీరోలు కూడా వచ్చే సినిమాల విడుదలపై కూడా చాలా నమ్మకంతో ఉన్నారు.

ఇక డిసెంబర్లో రెండు సినిమాల మధ్య పోటీ తీవ్రత కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక త్వరలోనే రాబోయే పెద్ద సినిమా పుష్ప కూడా కొన్ని సినిమాలకు పోటీని ఇచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని కూడా అభిమనుకు చాలా నమ్మకంతో ఉన్నారు. ఇక నిర్మాతలు కూడా చాలా ఏరియాల్లో సొంతంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై పెట్టుబడి కూడా గట్టిగానే పెట్టారట. అసలైతే సినిమాను జనవరిలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో పెద్ద సినిమాల హడావుడి ఎక్కువగా ఉండటం వలన డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు డిసైడ్ అయ్యారు.

 Mega hero Varun tej ghani movie postponed plans,

అయితే డిసెంబర్ 24వ తేదీన నాని శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక అదే సమయంలో మెగా హీరో వరుణ్ తేజ్ గని సినిమా కూడా విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మిస్తున్న గని అతనికి మొదటి సినిమా కావడంతో అతను రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. అయితే ఈ పోటీలో ఇదివరకే నిర్మాతల మధ్య చర్చలు జరిగాయి. వీలైనంత వరకు శ్యామ్ సింగరాయ్ సినిమాను సోలోగానే విడుదల చేయాలని నాని ఆలోచిస్తున్నాడు. అయితే గని సినిమాను కూడా ఒంటరిగానే రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..

జనవరి-ఫిబ్రవరి లో పెద్ద సినిమాలుల్ హడావిడి కాస్తా ఎక్కువగానే ఉంది కాబట్టి గని సినిమాను మార్చిలో విడుదల చేస్తే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమాపై హీరో వరుణ్ తేజ్ కూడా చాలా నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. గని సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఇక మరోవైపు వరుణ్ తేజ్ నటించిన F3 సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అసలైతే గని సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అదే సమయంలో F3 సినిమా వస్తుండడంతో వరుణ్ తేజ్ సినిమాలు ఒకేసారి క్లాష్ అవ్వడం ఏ మాత్రం కరెక్ట్ కాదని గని సినిమా మార్చి చివరలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది మరి ఈ రెండు సినిమాలతో మెగా హీరో వరుణ్ తేజ్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X