Varun Tej Lavanya: పెళ్లయ్యాక అవి బాగా ఎక్కువైయ్యాయి.. లావణ్య టార్చర్​పై వరుణ్ తేజ్ కంప్లైంట్

పెళ్లి తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్​, లావణ్య త్రిపాఠి మీడియాలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్​గా మారిపోయారు. వారికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది. పైగా ఈ ఇద్దరు పెళ్లైన కొత్తలో పెద్దగా కనపడలేదు కానీ ఈ మధ్య తమ సినిమా సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంర్వ్యూలు, పలు షోలలో సందడి చేస్తున్నారు. ఒకరి గురించి మరొకరు చెప్పుకుంటూ తమ బంధం ఎలాంటిదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలా తాజాగా వరుణ్ తేజ్​ పెళ్లి తర్వాత లైఫ్ ఎలా మారింది? లావణ్య తనను ఎలా టార్చర్ చేస్తుందనే విషయాల్ని ఓపెన్ అయిపోయారు? దాని గురించే ఈ కథనం..

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఈ మధ్య వరుస ఫ్లాపుల్లో ఉన్న సంగతి తెలిసిందే. సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆపరేషన్‌ వాలంటైన్ అనే భారీ సినిమా చేశారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్ బ్యాక్‌ డ్రాప్​లో ఈ సినిమా తెరకెక్కింది. శక్తిప్రతాప్‌ సింగ్ దీన్ని తెరకెక్కించారు. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని రూపొందించారు. మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి చిల్లర్ హీరోయిన్​గా నటించింది. మిర్‌ సర్వార్‌, నవదీప్ త‌దిత‌రులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Mega Hero Varun Tej Talking About His Life After Marriage Full Details Here

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్​ నుంచి రాబోతున్న తొలి చిత్రమిదే. భారీ బడ్జెట్​తో తెరకెక్కిన సినిమా కారణంగా గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. వ‌రుణ్ తేజ్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయనకు పర్సనల్​ లైఫ్​కు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురౌతున్నాయి. ఆయన కూడా వాటికి ఎంతో ఓర్పుగా సమాధానాలు చెబుతున్నారు.

తాజాగా వ‌రుణ్ తేజ్... హైదరాబాద్ శివార్లలోని మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ఆపరేషన్‌ వాలెంటైన్ టీమ్​తో క‌లిసి సంద‌డి చేశాడు. యాంకర్ సుమ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసింది. అక్కడి స్టూడెంట్స్​తో ఈ టీమ్​ అంతా ఇంటరాక్ట్ అయింది. ఈ క్రమంలోనే సుమ... వరుణ్​ను ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది. పెళ్లి త‌ర్వాత లైఫ్​లో ఎలాంటి మార్పులు వ‌చ్చాయి అంటూ అడిగింది.

అందుకు వ‌రుణ్ సమాధానమిస్తూ.. పెళ్లి తర్వాత జీవితం మారిపోయింది. ఫోన్‌కాల్స్ ఎక్కువగా రావడం మొదలయ్యాయి. ఎక్కడి వెళ్తున్నావనే ప్రశ్నలు ఎదురౌతున్నాయి అంటూ చెప్పారు. అయితే అదంతా లావణ్య చేసేది ప్రేమ‌తోనే అని అన్నారు. అంటే ఫైనల్​గా పెళ్లి తర్వాత లావణ్య త‌ర‌చూ తనకు ఫోన్ చేస్తూ ఇతర వైఫ్స్​ మాదిరిగానే టార్చ‌ర్ పెడుతుంద‌ని నవ్వుతూ ప‌రోక్షంగా చెప్పకనే చెప్పారు వరుణ్​.

Mega Hero Varun Tej Talking About His Life After Marriage Full Details Here

ఇంకా వాలంటైన్స్​ డే రోజు లావ‌ణ్య‌కు ఏం గిఫ్ట్ ఇచ్చారో చెప్పాలని అడగగా... ఏం ఇవ్వ‌లేద‌ని, తామిద్దరం కలిసి వెకేష‌న్‌కు వెళ్లామ‌ని చెప్పారు వరుణ్. కాగా, గత ఏడాది న‌వంబ‌ర్​లో వ‌రుణ్.. త‌న ప్రియ‌స‌ఖి, ప్ర‌ముఖ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నారు. ఆమెతో కలిసి ఏడ‌డుగులు వేశారు. ఇటలీలో ఈ జంట డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X