Ram Charan: రామ్ చరణ్ సరికొత్త రికార్డ్.. మహేశ్ బాబు, ప్రభాస్ లను మించిపోయన చెర్రీ

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో తెలుగు తెరపై తెరగేంట్రం చేసిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇటీవల RRR మూవీతో మాసీవ్ హిట్, ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న ఈ హీరో.. తన 15వ సినిమా క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీనితెలుగు, తమిళంలేనే కాకుండా పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీతో రెండో సారి చెర్రీ జతకట్టనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే రామ్ చరణ్ సరికొత్త ఘనత సాధించాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లను సైతం పక్కకు నెట్టి మరి ఈ రికార్డు సాధించాడు. మరి ఆ రికార్డు, ఆ వివరాలేంటో చూద్దామా!

ఆచార్య ప్లాప్ గురించి..

ఆచార్య ప్లాప్ గురించి..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల నటించి RRR మూవీ ఎంత పెద్ద హిట్ అయిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని తర్వాత వచ్చిన ఆచార్య ప్లాప్ గురించి అందరికీ తెలిసిందే. దీంతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకోవాలని టాప్ డైరెక్టర్ శంకర్ తో రెడీ అవుతున్నాడు.

 పాన్ ఇండియా సినిమాగా..

పాన్ ఇండియా సినిమాగా..

రామ్ చరణ్ తేజ్- క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ RC15. ఈ సినిమాపై మెగా అభిమానుల్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. కేవలం తెలుగు, తమిళ భాషలకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా సినిమాగా మిగతా భాషల్లో కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

 మిగతా సెలబ్రిటీలతో పోల్చితే..

మిగతా సెలబ్రిటీలతో పోల్చితే..

ఇక ఇదిలా ఉంటే సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా రామ్ చరణ్ హవా మాములుగా లేదు. నిజానికి, మిగతా సెలబ్రిటీలతో పోల్చితే కాస్తా లేటుగా సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ లో ఖాతా తెరిచాడు రామ్ చరణ్. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తా అన్నట్లుగానే ఇన్ స్టాగ్రామ్ లో సాలిడ్ రికార్డ్ సెట్ చేశాడు.

అతి తక్కువ సమయంలో..

అతి తక్కువ సమయంలో..

సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ లో అకౌంట్ తెరచి అతి తక్కువ సమయంలో 9 మిలియన్ ఫాలోవర్స్ ను అందుకున్న హీరోగా రికార్డుకెక్కాడు. ఎందుకంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లకు 8.9 మిలియిన్ ఫాలోవర్స్ ఉండగా వాళ్లకన్న లేట్ గా ఎంట్రీ ఇచ్చి 9 మిలియన్ ఫాలోవర్లను సాధించడం ఘనతగా పేర్కొంటున్నారు.

 ఒక లక్ష ఫాలోవర్లతో..

ఒక లక్ష ఫాలోవర్లతో..

అంటే.. 90 లక్షల ఫాలోవర్లతో మహేశ్ బాబు, ప్రభాస్ కంటే ఒక లక్ష ఫాలోవర్లతో ముందంజలో ఉన్నాడు చెర్రీ. ఇక మహేశ్ బాబు, ప్రభాస్ కు 89 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తెలుగు హీరోల్లో అందరికన్నా టాప్ లో కోటి 96 లక్షల (19.6 మిలియన్) ఫాలోవర్లతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడు.

 పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో..

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో..

కాగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న రామ్ చరణ్ మూవీకి సంబంధించి ఇటీవల కొన్ని ఫొటోలు లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్. అలాగే ఒక సాధారణ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం నుంచి, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎలా వెళ్లాడనే కథను స్ట్రాంగ్ చూపించబోతున్నాడట డైరెక్టర్ శంకర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X