రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో ఆ దర్శకుడు.. ఆ కాంబినేషన్ నిజమయ్యేలా ఉందిగా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఇక టైటిల్ ప్రోమో, ఫస్ట్ లుక్ పోస్టర్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆవిష్కరించగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ చేయబోతున్నాడు.
ఇది కూడా పాన్ ఇండియా సినిమాగానే తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా కన్నడ దర్శకుడు నార్తన్ తో రామ్ చరణ్ సినిమా ఉంటుంది అనే ప్రచారం నడుస్తుంది. యూవీ క్రియేషన్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది అనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అయితే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలలో నార్తన్ పాల్గొన్నాడు. చెర్రికి ప్రత్యేకంగా కలిసి విశేష్ చెప్పాడు. దీంతో ఈ దర్శకుడితో చరణ్ మూవీ కన్ఫర్మ్ అయినట్లే అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. గతంలోనే నార్తన్ రామ్ చరణ్ కి స్టొరీ చెప్పడం జరిగింది అని టాక్ వచ్చింది. అయితే సరైన టైమ్ చూసుకొని ఎనౌన్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నట్లుగా టాక్.
నార్తన్ కన్నడలో మఫ్డీ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు శివరాజ్ కుమార్ తో భైరాతి రానగల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ మఫ్టీకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతుంది.
ఈ మూవీ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ తో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో నార్తన్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఈ మూవీకి సంబందించిన అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట.


Click it and Unblock the Notifications











