Ram Charan పాపులర్ అవార్డుకు అడుగుదూరంలో రాంచరణ్.. టామ్ క్రూజ్, బ్రాడ్‌పిట్‌తో అమీతుమీ!
మెగా పవర్‌స్టార్ రాంచరణ్ మరో అరుదైన ఘనతకు చేరవయ్యారు. ఇంటర్నేషన్ స్థాయిలో టాప్ యాక్టర్లతో పోటీ పడుతూ క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డుల రేసులో ముందు వరుసలో ఉన్నారు. మార్చి 16న ప్రకటించే అవార్డు కోసం ఇప్పటికే రాంచరణ్ తన ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. RRR సినిమాలో తన ప్రతిభ ద్వారా ఈ అవార్డును అందుకొనేందుకు రెడీ అవుతున్నారు. ఈ అవార్డు గురించిన వివరాల్లోకి వెళితే..

క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు కోసం
ఆస్కార్, సినీ క్రిటిక్ సూపర్ అవార్డుల ప్రమోషన్స్ కోసం అమెరికాకు వెళ్లిన రాంచరణ్‌కు ప్రవాస భారతీయుల నుంచి విశేష స్వాగతం లభించింది. గుడ్ మార్నింగ్ అమెరికా టాక్‌లో పాల్గొనడమే కాకుండా అమెరికా వ్యాప్తంగా భారీ రెస్పాన్స్‌ను సంపాదించుకొన్నారు. అవార్డుల కోసం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా మారిపోయారు. ఇక క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు సాధించేందుకు అడుగులు వేస్తున్నారు.

మూడో క్రిటిక్ ఛాయిస్ అవార్డు వేడుక
అమెరికాలో క్రిటిక్ ఛాయిస్ అసోసియేషన్ 2020లో ది క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్సును ప్రారంభించింది. కోవిడ్ కారణంగా 2021లో ఈ అవార్డుల ప్రధానం జరిగింది. యాక్షన్, సూపర్ హీరో, హారర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, యానిమేషన్ కేటగిరిలో ప్రధానం చేస్తారు. తాజాగా మూడో క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డులను అందించేందుకు సిద్దమైంది. మార్చి 16వ తేదీన ఈ అవార్డును ప్రకటిస్తారు.

భాషలకు అతీతంగా రాంచరణ్
RRR చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్బుతంగా ఫెర్ఫార్మెన్స్ చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భాషలకు అతీతంగా రాంచరణ్ ప్రశంసలు అందుకొంటున్నారు. ఈ సినిమాలో అత్యుత్తమ ప్రతిభను చాటినందుకు గాను.. బెస్ట్ యాక్షన్ మూవీ క్యాటగిరీలో నామినేట్ అయింది.

టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌తో రాంచరణ్ పోటీ
క్రిటిక్ ఛాయిస్ సూపర్ అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరిలో అవార్డు కోసం రాంచరణ్‌తోపాటు ఎన్టీఆర్ కూడా పోటీ పడుతున్నారు. ఈ అవార్డు రేసులో హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూయిజ్, నికోలాస్ కేజ్, బ్రాడ్ పిట్ లాంటి వాళ్లు ఉండటం పోటీ రసవత్తరంగా మారింది. అయితే RRR చిత్రంలో రాంచరణ్ ప్రదర్శించిన పాత్రకు మంచి రెస్సాన్స్ వస్తుండటంతో ఈ సారి మెగా పవర్ స్టార్ అవార్డు కావడం ఖాయమని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.

శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్
రాంచరణ్ కెరీర్ విషయానికి వస్తే.. RRR సినిమా తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సామాజిక నేపథ్యం ఉన్న చిత్రంలో నటిస్తున్నారు. రాజకీయాల ప్రధాన పాత్రతో సాగే చిత్రంలో సీఎం పాత్రలో కనిపిస్తారనే ప్రచారం మీడియాలో జరుగుతున్నది. ఇంకా బుచ్చిబాబు, ఇతర దర్శకులతో పనిచేసేందుకు రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











