For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ చరణ్ చేతికి విలువైన వాచ్: దాని ధర ఎంతో తెలిస్తే నిద్ర కూడా పట్టదు.. ఇది కూడా రికార్డే!

  |

  మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు రామ్ చరణ్. 'చిరుత' అనే సినిమాతో హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన అతడు.. ఆ తర్వాతి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి వరుసగా పలు పరాజయాలను చవి చూశాడు. ఇలాంటి సమయంలోనే పంథాను మార్చుకుని విజయాల బాట పట్టాడు.

  సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఈ మెగా పవర్ స్టార్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తాజాగా తన 15వ సినిమాను కూడా ప్రారంభించాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు అతడు ఎంతో విలువైన వాచ్‌ను ధరించి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆ వాచ్ ధర ఎంతో తెలుసా?

  రెండు సినిమాలు చేసిన రామ్ చరణ్

  రెండు సినిమాలు చేసిన రామ్ చరణ్

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం)లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఇందులో అతడు అల్లూరిగా, తారక్ కొమరం భీంగా కనిపించనున్నారు. దీనితో పాటు చిరంజీవి - కొరటాల కాంబోలో వస్తున్న ‘ఆచార్య'లోనూ సిద్ధ అనే నక్సలైట్ పాత్రను పోషిస్తున్నాడు.

  ఆ కంటెస్టెంట్‌కు నాగబాబు సపోర్ట్: బిడ్డ లాంటి వాడంటూ కామెంట్.. అభిజీత్ గెలిచినట్లే తను కూడా!

  లెజెండరీ డైరెక్టర్‌తో చరణ్ భారీ మూవీ

  లెజెండరీ డైరెక్టర్‌తో చరణ్ భారీ మూవీ

  RRR, ఆచార్య తర్వాత రామ్ చరణ్ నటించబోయే ప్రాజెక్టు గురించి చాలా కాలంగా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే అతడు ఫలానా దర్శకుడితో చేయబోతున్నాడంటూ ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఊహించని విధంగా ఈ మెగా హీరో.. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుంది.

  దాన్ని ఆపేసి.. దీన్ని లైన్‌లో పెట్టేశారు

  దాన్ని ఆపేసి.. దీన్ని లైన్‌లో పెట్టేశారు

  చాలా ఏళ్ల క్రితమే డైరెక్టర్ శంకర్‌.. కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2' అనే ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే, కొన్ని వివాదాల కారణంగా అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో నిర్మాణ సంస్థతో ఆయనకు విభేదాలు రావడంతో ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. కానీ, ఇటీవలే దీనికి కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో శంకర్.. రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాపై పూర్తిగా దృష్టి సారించారని తెలుస్తోంది.

  యాంకర్ రవికి మానస్ వార్నింగ్: ఆమెతో ఎఫైర్ ఉందని అనడంతో ఫైర్.. అతడి స్థాయి అదే అంటూ షాకింగ్‌గా!

  దాదాపుగా అన్నీ కంప్లీట్ చేసిన శంకర్

  దాదాపుగా అన్నీ కంప్లీట్ చేసిన శంకర్

  రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాకు సంబంధించి శంకర్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టి.. దాదాపుగా వాటిని పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్‌ మీద దృష్టి సారించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జయరాం, శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులను ఎంపిక చేసుకున్నారు. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్, హీరోయిన్‌గా కియారా అద్వాణీని సెలెక్ట్ చేశారు.

  వైభవంగా లాంచ్.. వాళ్లంతా వచ్చారు

  వైభవంగా లాంచ్.. వాళ్లంతా వచ్చారు

  భారతదేశంలోనే దిగ్గజ దర్శకుడు శంకర్ - టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను సెప్టెంబర్ 8న అంగరంగ వైభవంగా జరిగాయి. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దీంతో ఈ వేడుక ఎంతో సందడిగా సాగింది. దీన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను కూడా వదిలింది.

  Bigg Boss Telugu 5: ఆమె కాళ్లు పట్టుకుని ఏడ్చిన జస్వంత్.. మళ్లీ నోరు జారి అంత మాట అనడంతో!

  బాగా హైలైట్ అయిన రామ్ చరణ్ వాచ్

  బాగా హైలైట్ అయిన రామ్ చరణ్ వాచ్

  పాన్ ఇండియా రేంజ్ మూవీ కావడంతో పాటు దిగ్గజాలు పాల్గొనడంతో రామ్ చరణ్ 15వ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక, ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ విలువైన వాచ్‌ను ధరించి వచ్చాడు. దీంతో అందరి ఫోకస్ దానిపైనే పడింది. దీంతో అసలు ఆ వాచ్ ధర ఎంత? అది ఏ బ్రాండ్? అని అంతా ఇంటర్నెట్‌లో తెగ సెర్చింగ్ చేసేస్తున్నారు.

  ఆ వాచ్ ధర తెలిస్తే నిద్ర కూడా పట్టదు

  ఆ వాచ్ ధర తెలిస్తే నిద్ర కూడా పట్టదు

  తాజాగా జరిగిన తన 15వ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో రామ్ చరణ్ ధరించింది Richard Mille బ్రాండ్‌కు చెందిన RM 61-01 Yohan Blake వాచ్. దీని ఖరీదు 117500 యూరోలు. అంటే మన భారతదేశ కరెన్సీలో దీని ధర రూ. 1. 02 కోట్లు. రేటు వింటేనే వామ్మో అని నోరెళ్లబెట్టేస్తున్నారంతా. ఇక, ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ ‘మా వాడి వాచ్ ఖరీదు.. మీ హీరో ఓపెనింగ్ డే కలెక్షన్స్ అంత' అన్నట్లుగా పోస్టులు పెడుతున్నారు.

  సుమ షోలో సంచలన సంఘటన: నిజంగా తిట్టుకున్న జబర్ధస్త్ భామలు.. కెమెరాలు ఉన్నా కిందపడి మరీ!

  Koratala Siva సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి.. Acharya కోసం సెంటిమెంట్ క్విట్ || Filmibeat Telugu
  రామ్ చరణ్ దగ్గర 30కి పైగా వాచ్‌లు

  రామ్ చరణ్ దగ్గర 30కి పైగా వాచ్‌లు

  రామ్ చరణ్‌కు వాచ్‌లు అంటే చాలా ఇష్టం అన్న విషయం చాలా మందికి తెలీదు. అతడి దగ్గరు ఎంతో విలువైన వాచ్‌లు సుమారు 30 వరకూ ఉన్నాయి. అందులో రూ. 85 లక్షల వాచ్ ఉండేది. అదే ఇప్పటి వరకూ అతడి దగ్గర ఉన్న వాటిలో అత్యంత విలువైనది. దాన్ని ఇప్పుడు కొత్త వాచ్ దాటేసింది. దీంతో టాలీవుడ్‌లో అత్యంత విలువైన వాచ్‌ను ధరించిన హీరోగానూ రామ్ చరణ్ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు.

  English summary
  Mega Power Star Ram Charan Recently Participated in His 15th Film Launch Event. Weared Rs 1 Crore RM Watch In This Ceremony.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X