Ram Charan Shriya Saran: సినిమాల్లోకి రాకముందు శ్రీయతో రామ్ చరణ్, వీడియో వైరల్! ఏం చేశాడంటే?
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో తెలుగు తెరపై తెరగేంట్రం చేసిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇటీవల RRR మూవీతో మాసీవ్ హిట్, ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న ఈ హీరో.. తన 15వ సినిమా క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీని తెలుగు, తమిళంలేనే కాకుండా పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా 2007లో ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందే శ్రీయ సరన్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. కానీ వీళ్లిద్దరు సినిమాల్లోకి రాకముందే కలిసి ఉన్న వీడియో చక్కర్లు కొడుతోంది.

హీరోగా నెక్ట్స్ లెవెల్ కి..
స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతతోనే ఎంతో ఆకట్టుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్ నటన చూసి తనకు అది ఫస్ట్ మూవీలా చేయలేదని.. ఎన్నో సినిమాల్లో నటించిన అనుభవం ఉన్నట్లుగా యాక్టింగ్ ఉందని విమర్శకులు సైతం ప్రశంసించారు. అనంతరం దర్శక దిగ్గజం రాజమౌళి మగధీర సినిమాతో హీరోగా నెక్ట్స్ లెవెల్ కి ఎదిగిపోయాడు.

వరల్డ్ వైడ్ గా పాపులర్..
మొదటి సినిమాకు చిరంజీవి కొడుకు అనే ట్యాగ్ తో ఎంటరైనప్పటికీ తర్వాతి సినిమాల్లో తన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇక అప్పటివరకు టాలీవుడ్ హీరోగా వెలుగొందిన రామ్ చరణ్ ఒక్కసారిగా జక్కన చెక్కిన అద్భుతమైన కళాఖండం RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన రామ్ చరణ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

ట్రూ లెజెండ్ అవార్డ్..
ఒకప్పుడు తన యాక్టింగ్ పై విమర్శలు ఎదుర్కొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో తన నటనేంటో రుచి చూపించాడు. అల్లూరి సీతరామరాజుగా రామ్ చరణ్ నటనకు విమర్శకులు సైతం ప్రశంసించేలా చేశాడు. అంతేకాకుండా ఇటీవల ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్సులో ట్రూ లెజెండ్ పురస్కారం అందుకుని దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాడు. అంతలా తన నటనతో సత్తా చాటాడు రామ్ చరణ్.

శంకర్ దర్శకత్వంలో..
అయితే RRR తర్వాత ఆచార్య సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మెగా అభిమానుల్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. కేవలం తెలుగు, తమిళ భాషలకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా సినిమాగా మిగతా భాషల్లో కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

సర్ ప్రైజింగ్ గా చెర్రీ వీడియో..
RC15 నుంచి ఇప్పటికే లీక్ అయిన రామ్ చరణ్ ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అలాగే ఇటీవల తాను తండ్రి కాబోతున్నట్లు గుడ్ న్యూస్ కూడా చెప్పాడు రామ్ చరణ్. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కు సంబంధించిన ఒక వీడియో అభిమానులను, ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసింది. అది ఇప్పటివరకు రామ్ చరణ్ గురించి తెలియని విషయం. రామ్ చరణ్ చిరుత సినిమా నుంచే మనకు తెలుసు. కానీ ఈ వీడియో రామ్ చరణ్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశాడో చూపించింది.

చెర్రీ, శ్రీయ ఇద్దరు కలిసి..
రామ్ చరణ్ హీరో కాకముందు యాక్టింగ్ స్కూల్ కు వెళ్లాడని చాలా మందికి తెలియదు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో రామ్ చరణ్ యాక్టింగ్ స్కూల్ లో తన స్కిల్స్ డెవలప్ చేసుకోవడం చూడవచ్చు. పలు సన్నివేశాలకు రామ్ చరణ్ నటనా విధానాన్ని అందులో చూడొచ్చు. అయితే ఇందులో గ్లామర్ బ్యూటి శ్రీయ సరన్ ఉండటం విశేషం. రామ్ చరణ్, శ్రీయ సరన్ ఇద్దరు కలిసి ఏదో థీమ్ కు ప్రాక్టీస్ చేస్తూ కనువిందు చేశారు.
ఇండస్ట్రీలోకి రాలేదని..
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో రామ్ చరణ్ తో పాటు శ్రీయ సరన్ కూడా సినీ ఇండస్ట్రీలోకి రాలేదని తెలుస్తోంది. రామ్ చరణ్ 2007లో ఎంట్రీ ఇస్తే.. అప్పటికే శ్రీయ సరన్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆమె 2001లోనే ఇష్టం మూవీతో పరిచయం అయింది. అంటే రామ్ చరణ్, శ్రీయ సరన్ కనిపిస్తున్న ఈ వీడియో 2001 సంవత్సరానికంటే ముందుదై ఉండాలని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇక ఎంతగొప్ప హీరో హీరోయిన్లు అయినా గొప్ప స్థాయికి చేరాలంటే తాము చేసే పనిలో బెటర్ మెంట్ కోసం ప్రాక్టీస్ చేయాలని ఈ వీడియో చెప్పకనే చెబుతోంది. కాగా RRR సినిమాలో రామ్ చరణ్ కు శ్రీయ సరన్ తల్లిగా నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











