దూసుకుపోతున్న వినయ్ విధేయ రామ టీజర్.. 4 మిలియన్ల వ్యూస్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ విజయ విధేయ రామ టీజర్ నేడు విడుదలైంది. రాంచరణ్ మునుపెన్నడూ లేని విధంగా పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నాడు. టీజర్ పక్కా బోయపాటి మార్క్ తో ఉంది. మాస్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు అన్ని అదరగొడుతున్నాయి.
ఉదయం 10:25 గంటలకు విడుదలైన టీజర్ అప్పుడే 4 మిలియన్ వ్యూస్ సాధించింది. మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా 'ఇక్కడ రామ్.. రామ్ కొనిదెల అంటూ రాంచరణ్ చెబుతున్న డైలాగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఈ డైలాగ్ ని మెగా ఫాన్స్ చిరంజీవి ఎస్పీ పరుశురాం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రాలతో పోల్చుకుంటూ మురిసిపోతున్నారు. ఎస్పీ పరుశురాం చిత్రంలో నా పేరు రామ్.. ఎస్పీ పరుశురామ్ అని చెప్పే మెగాస్టార్ డైలాగ్, బద్రి చిత్రంలో నువ్వు నంద అయితే నేను బద్రి బద్రి నాథ్ అని పవన్ చెప్పే డైలాగ్స్ తో వినయ విధేయ రామ టీజర్ ని పోల్చుతున్నారు.


Click it and Unblock the Notifications











