Varun Tej పొట్టి పోలీస్ ఆఫీసర్ రామ్‌చరణా లేదా ఎన్టీఆరా - నాగబాబు కాంట్రవర్సీపై వరుణ్ తేజ్ క్లారిటీ!
మెగా నటుడు నాగబాబు ఏం మాట్లాడినా చాలా సార్లు కాంట్రవర్సీ అవుతూనే ఉంటుంది. తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఆరడుగులున్న తన కొడుకును ప్రశంసించే క్రమంలో ఐదడుగుల హీరోలు కూడా పోలీస్ పాత్రలు చేస్తున్నారంటూ కాస్త వెటకారంగా మాట్లాడారు. ఇది కాస్త రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేపింది. అయితే దీనిపై వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ అసలేం జరిగింది? వరుణ్ తేజ్ ఏమని వివరణ ఇచ్చారో తెలుసుకుందాం...
ఎలాగైనా హిట్ కొట్టేందుకు: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. వరుస పరాజయాలతో ఉన్న ఆయన ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని నిర్మించారు. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ వరుణ్ సరసన హీరోయిన్గా నటించింది. నవదీప్, మిర్ సర్వార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాంట్రవర్శీ: ఇక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నుంచి రాబోతున్న తొలి చిత్రం కూడా ఇదే. భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం కారణంగా వరుణ్ గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. అంత సాఫీగా సాగింది అనుకునే లోపు కాంట్రవర్సీ ఎదురైంది. ఈ ఈవెంట్లో వరుణ్ తండ్రి నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేగింది.

నాగాబాబు కామెంట్స్ వివాదం: ఆరడుగులున్న తన కొడుకును ప్రశంసించే క్రమంలో ఐదడుగుల హీరోలు కూడా పోలీస్ పాత్రలు చేస్తున్నారంటూ నాగబాబు కాస్త వెటకారంగా అన్నారు."కొన్ని కొన్ని సార్లు కొన్ని క్యారెక్టర్లు క్యారీ చేయాలంటే ఒక 5 అడుగుల 3 అంగుళాలు ఉన్నవాడు, నేను ఫిట్ పోలీసాఫీసర్ అంటే కామెడీగా అనిపిస్తుంది. నువ్వు కాదులేరా బాబూ అనిపిస్తుంది." అని అన్నారు. ఇది కాస్త వివాదంగా మారింది.

నాగబాబుపై ఫ్యాన్స్ ఫైర్: దీంతో రామ్‌చరణ్ - ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేయడం మొదలుపెట్టారు. జంజీర్లో పోలీస్ ఆఫీస్రగా చేసిన రామ్‌చరణ్‌ను అన్నారని కొందరంటే మరి కొందరు బాద్ షా సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఎన్టీఆర్‌ను అన్నారని మండిపడుతున్నారు. ఇక కోలీవుడ్ లో సూర్య కూడా సింగం సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సూర్య హైట్ మీద కూడా కావొచ్చని మండిపడ్డారు. అటు కోలీవుడ్, టాలీవుడ్ లో నాగబాబు కామెంట్స్ వివాదం అయ్యాయి.

క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్: నాగబాబు ఇచ్చిన ఈ స్టేట్మెంట్పై తాజాగా వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. హైట్‌కు సంబంధించి తన తండ్రి చేసిన వ్యాఖ్యలు ఎవ్వరినీ ఉద్దేశించి చెప్పినవి కాదని వివరించారు. తన హైట్ 6.3ను దృష్టిలో పెట్టుకుని, పోలిక కోసం 5.3 అడుగులు అన్నారని వరుణ్ అన్నారు. అంతకుమించి మరో హీరోను సెటైరికల్‌గా అనలేదని క్లారిటీ ఇచ్చారు. మరో హీరోను కించపరిచే ఉద్దేశం నాగబాబుకు లేదని చెప్పారు.


Click it and Unblock the Notifications











