Varun Tej: 50 ఏళ్ల వ్యక్తిగా మారబోతున్న వరుణ్ తేజ్.. ఏ సినిమా కోసమో తెలుసా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ అందరినీ అలరించే ఈయన.. ఇటీవలే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో వచ్చారు. ఈ సినిమా విజ్యువల్ వండర్ గా ఉన్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో మాత్రం ఆడలేదు. కానీ నెక్స్ట్ మూవీతో మాత్రం కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్న వరుణ్.. ఓ కొత్త సినిమా చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపరేషన్ వాలెంటైన్ సినిమాపై అనేక ఆశలు పెట్టుకున్న వరుణ్ తేజ్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. అనుకున్న స్థాయిలో అస్సలే ఆడలేదు. దీంతో నిరాశలో ఉన్న ఈ యంగ్ హీరో... రాబోయే సినిమాతో మాత్రం కచ్చితంగా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకునేందుకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ మూడు డిఫరెంట్ లుక్ లలో కనిపించబోతున్నారట.

కరుణ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు మట్కా అనే పేరు పెట్టారు. అయితే ఇందులో వరుణ్ తేజ్ హీరోగా కనిపించబోతుండగా.. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహిలు హీరోయిన్లుగా నటించనున్నారు. అలాగే అందాల రాక్షసి మూవీ ఫేమ్ నవీన్ చంద్ర, కిషోర్, మైమ్ గోపి, అజయ్ ఘోష్, రూపలక్ష్మి, పి రవి శంకర్, సలార్ చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్ లు ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు.
వైరా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై.. రజని తల్లూరి, తీగల కృపాకర రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయబోతుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించనున్నారు. ఇప్పటికీ ఈ సినిమాపై అందరికీ భారీ అంనచాలు ఏర్పడగా.. తాజాగా మరో న్యూస్ లీక్ అయింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ మూడు వయసులకు సంబంధించిన ఏజ్ గ్రూపులలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

ముఖ్యంగా 20 ఏళ్ల కుర్రాడిగా, 30 ఏళ్ల వ్యక్తిగా, 50 ఏళ్ల వృద్ధుడిగా వరుణ్ తేజ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. అయితే 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించేందుకు వరుణ్ తేజ్ బరువు పెరిగి.. బాగా లావుకాబోతున్నారట. ఆపరేషన్ వాలెంటైన్ కోసం యమా ఫిట్ గా కనిపించిన ఈయన మట్కా సినిమాలో వృద్ధుడిగా కనిపించేందుకు ప్రయత్నించడం నిజంగా అభినందనీయమే. సినిమా కోసం, అందులోని పాత్ర కోసం.. వరుణ్ తేజ్ 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నాడని తెలిసినప్పటి నుంచి అంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











