Varun Tej: రవితేజతో సినిమాకు అందుకే నో చెప్పాను.. అతడితో కలిసి కచ్చితంగా చేస్తాను!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకునే ఈ కుర్ర హీరో తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మార్చి 1వ తేదీన ఆయన హీరోగా చేసిన ఈ కొత్త సినిమా వస్తుండగా.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ షాకింగ్ విషయాలు చెబుతున్నాడు. అయితే తాజాగా ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో రవితేజతో సినిమా చేయాలని ఆఫర్ రాగా తాను నో చెప్పినట్లు వివరించాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వరుణ్ తేజ్ హీరోగా.. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పేరే ఆపరేషన్ వాలెంటైన్. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్, రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్ అబ్బినేని నిర్మించిన ఈ సినిమానుమ మార్చి ఒకటవ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అలాగే మానుషి చిల్లర్ ఈ సినిమలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే రుహానీ శర్మ, అలీ రెజా, నవదీప్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇదంతా ఇలా ఉండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈక్రమంలోనే ఆసక్తిక విషయాలు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి సినిమా చేయాలని ఉందా అని అడిగితే చేయాలని ఉందన్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ తాను మాత్రం ఏ డైరెక్టర్ కు కూడా లావణ్యను హీరోయిన్ గా తీసుకోమని చెప్పనని అన్నాడు. డైరెక్టర్ కు నచ్చి అవకాశం ఇస్తే మాత్రం కలిసి హాయిగా సినిమా చేస్తామని చెప్పుకొచ్చారు.
అలాగే మెగా ఫ్యామిలీ హీరోలతో కాకుండా మరో హీరోతో అయినా సినిమా చేయాలని ఉందా అని అడిగితే ఓ కుర్ర హీరో పేరు చెప్పుకొచ్చాడు. తనకు నితిన్ తో కలిసి సినిమా చేయాలని ఉందని.. తమ ఇద్దరి మధ్య ర్యాపో బాగుంటుందని కూడా వివరించాడు. తమ మధ్య ఉన్న స్నేహంతో హాయిగా ఈ సినిమా చేయొచ్చని వివరించాడు. అలాగే ఏ హీరోతో అయినా సినిమా చేయాల్సి ఉంటే క్యాన్సిల్ అయిందా అని అడగ్గానే.. రవితేజతో ఓ సినిమా చేయాల్సి ఉందని... కానీ నో చెప్పినట్లు చెప్పాడు.

ముఖ్యంగా తన వద్దకు వచ్చి రవితేజ కథ విన్నారని చెప్పడం.. ఆయన వద్దకు వెళ్లి వరుణ్ తేజ్ కథ విన్నాడని మీరిద్దరూ కలిసి చేయండంటూ చాలా సార్లు వచ్చారని.. కానీ కథ నచ్చక ఆ సినిమాకు నో చెప్పినట్లు వివరించాడు. ఇలా రవితేజతో సినిమా చేసే అకాశాన్ని మిస్ అయ్యాడు వరుణ్ తేజ్. మరి తాను ఇష్టపడ్డట్లుగా హీరో వరుణ్ తేజ్ తో కిలసి అయినా సినిమా చేస్తాడా లేదా తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











