అనారోగ్యంతో కష్టాల్లో అభిమాని.. మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సహాయం.. ఎంత సహాయం చేశారంటే!
ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో గానీ, అనారోగ్యపరంగా సమస్యల్లో ఉంటే వారిని తన వారిగా భావించి ఆదుకోవడం మెగాస్టార్ చిరంజీవి నైజం. కష్టాల్లో ఉన్నామని తలుపు తట్టినా లేదా ఆయన తెలిసినా చిరంజీవి వెంటనే వారికి అండగా నిలుచున్న దాఖలాలు కోకొల్లలు. తాజాగా తన అభిమాని అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసిన మెగాస్టార్ ఆయన అండగా నిలిచారు. ఆ వివరాల్లోకి వెళితే..

కడప జిల్లాకు చెందిన అభిమానికి
రాయలసీమలోని కడప జిల్లాకు చెందిన ఎన్నో ఏళ్లుగా మెగాస్టార్‌ను అభిమానిస్తున్న యువకుడు, అఖిల భారత చిరంజీవి యువతకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న పి సురేష్ అనారోగ్యంతో బాధపడుతూ కదిరి పట్టణంలో ఉంటున్నారు. వైద్యం కోసం రెండు రోజులకోసారి కదిరి నుంచి తిరుపతి, కడప పట్టణాలకు వెళ్లి వస్తుంటారు. అందుకోసం ఎక్కువ మొత్తంలోనే ఖర్చు అవుతున్నది. ఈ విషయం తెలుసుకొన్న చిరంజీవి వెంటనే స్పందించారు.

అభిమానికి లక్ష రూపాయల సహాయం
కడప జిల్లా చిరంజీవి యువతకు అధ్యక్షుడిగా పనిచేసిన సురేష్‌ను వెంటనే సంప్రదించారు. ఆయనకు వైద్య ఖర్చుల నిమిత్తం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున సురేష్‌కు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఫిబ్రవరి 18వ తేదీ గురువారం సురేష్ అకౌంట్‌కు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేశారు.

కొద్ది రోజుల క్రితం సీనియర్ జర్నలిస్టుకు కూడా
ఇలా చిరంజీవి తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఆర్థిక సహాయం అందించడం మొదటిసారి కాదు. కష్టాల్లో ఉన్నవారిని తన వాళ్లుగా భావించి చాలా మార్లు ఆదుకొన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్‌రావును కూడా చిరంజీవి ఆదుకొన్న విషయం తెలిసిందే.

చిరంజీవి యువత ధన్యవాదాలు
ఆపదలో ఉన్నవాళ్లను రక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ముందుంటారని ఇలాంటి సంఘటనలతో మరోసారి రుజువైంది. కరోనావైరస్ కారణంగా సినీ పరిశ్రమ స్తంభించిన సమయంలో కూడా అయన ఎందరో అభిమానులకు తనదైన సపోర్ట్ అందించారు. ఈ సందర్బంగా అఖిల భారత చిరంజీవి యువత మెగాస్టార్ చిరంజీవి గారికి కృతఙ్ఞతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











