ఆడబిడ్డ పుట్టుక అపురూపం.. ఎన్నో ఏళ్ల కల సాకారం.. ఎవరి పోలిక అంటే.. చిరంజీవి ఎమోషనల్

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన కామినేని కొణిదెల దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. సోమవారం రాత్రి అపోలో హాస్పిటల్‌లో చేరిన ఉపాసన మంగళవారం తెల్లవారు జామున పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తనకు మనవరాలు పుట్టారనే వార్త తెలిసిన వెంటనే రాత్రి అపోలో హాస్పిటల్‌కు వచ్చి ఉపాసన యోగ క్షేమాలు తెలుసుకొన్నారు. ఉదయమే మళ్లీ హాస్పిటల్‌కు వచ్చి మనవరాలిని చూసుకొన్నారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..

జూన్ 20వ తేదీ మంగళవారం ఉదయం రాంచరణ్, ఉపాసన కొణిదెల దంపతులు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మా ఇంటిల్లి పాదికి ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. మీ తో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆడబిడ్డ పుట్టుక అపురూపం. ఎన్నో సంవత్సరాలుగా వాళ్లిద్దరు తల్లిదండ్రులు కావాలని, మా చేతిలో బిడ్డను పెట్టాలని కోరుకొంటున్నాం. అది ఇన్నేళ్ల తర్వాత భగవంతుడి దయవల్ల మా కోరిక నెరవేరింది. మాకు ఈ వార్త అపురూపమైందిగా, సంతోషంగా ఉంది అని చిరంజీవి అన్నారు.

రాంచరణ్, ఉపాసన దంపతులకు ఆడబిడ్డ పుట్టిన శుభ సందర్భంలో విదేశాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి మా బంధువులు, ఆత్మీయులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అలాగే మా సంతోషమే వారి సంతోషం అనుకొనే అభిమానులు రకరకాలుగా, వివిధ రూపాల్లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అది మాకు చాలా ఆనందం కలిగిస్తున్నది. మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి నా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చిరంజీవి అన్నారు.

మీడియా వారందరూ వచ్చారు. మాకు మరింత సంతోషాన్ని కలిగించారు. మీ అందరికి థ్యాంక్స్. ఆంజనేయస్వామి భక్తులమైన మాకు మంగళవారం రోజునే ఆడపిల్ల జన్మించడం హ్యాపీగా ఉంది. మంచి గడియలు అంటున్నారు. బిడ్డ రాక ప్రభావం ముందు నుంచే చూపిస్తున్నది అని చిరంజీవి ఆనందంతో చెప్పారు.

Mega Star Chiranjeevi reveals Interesting facts about Ram Charan and Upasana Konidelas daughter

రాంచరణ్ ఎదుగుదల, ఆయన సాధిస్తున్న విజయాలు, అలాగే వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్ జరగడం.. ఇలాంటి శుభకార్యాలు ఎన్నో జరిగాయి. వాటిన్నిటికి కారణం బిడ్డ రాక ప్రభావమే అనుకొంటున్నాను. చిన్నారి ఎవరి పోలీకలు అనే విషయం ఇంకా చెప్పలేం. రాత్రి వేళ చూశాం. అప్పడే ఎవరి పోలీక అనేది చెప్పలేం అని చిరంజీవి అన్నారు.

ఆంజనేయస్వామిని మేము నమ్ముకున్న కుటుంబం. అదే మంగళవారం మా ఇంటిలోకి బిడ్డ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆంజనేయస్వామి ప్రసాదించిన ఆడబిడ్డగా భావిస్తున్నాం అని చిరంజీవి అన్నారు. చెన్నై నుంచి ప్రత్యేకంగా వైద్యులను పిలిపించారు. పీసిరెడ్డి గారు దగ్గరుండి చూసుకొన్నారు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సురక్షితమైన జాగ్రత్తలు తీసుకొన్నారు. సుఖంగా, ప్రశాంతంగా అంతా జరిగిపోయింది. ఆడబిడ్డ పుట్టుక వెనుక ప్లానింగ్ ఏమీ లేదు. అలా జరిగిపోతుంటాయి అని చిరంజీవి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X