HBD Prabhas : ప్రభాస్‌పై బండ్ల గణేష్ ట్వీట్ వైరల్.. చిరు, వెంకీ, చరణ్ ఏం చెప్పారంటే!
ఈ రోజు యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు . చిత్ర పరిశ్రమలో వివాదరహితుడిగా, మనసున్న మారాజుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌కు ఇండస్ట్రీలో అందరూ స్నేహితులే. ఈ బాహుబలి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు , సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ వివరాల్లోకి వెళితే..
సాదాసీదా కమెడియన్‌గా, హీరోల ప్రక్కన అసిస్టెంట్‌గా కెరీర్ మొదలుపెట్టిన బండ్ల గణేశ్ .. తర్వాత నిర్మాతగా మారి, కోట్లాది రూపాయల భారీ బడ్జెట్‌తో స్టార్ హీరోలతో సినిమాలు తీసే రేంజ్‌కి ఎదిగాడు . ఆయన ఎదుగుదల చూసి బడా కమెడియన్లు, ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యపోయారు. ఏళ్లుగా ఉంటూ అవకాశాల కోసమే తాము వెతుక్కుంటుంటే బండ్ల గణేష్ టాప్ ప్రొడ్యూసర్ కావడంపై చాలామంది కుళ్లుకున్నారు. ఆయనపై లేనిపోని దుష్ప్రచారం సైతం చేశారు.

రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఎక్కువ కావడంతో అటు వైపు ఓ రాయి వేశాడు చూశాడు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీకి వెళ్లి మరి కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చాడు. నాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో గణేష్ కొంతకాలం సైలెంట్ అయ్యారు. 2023 ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్‌కు మద్ధతుగా ప్రచారం చేశారు. అయితే ఎంత వేగంగా టాప్ పొజిషన్‌లోకి వచ్చాడో, అంతే వేగంగా పరిశ్రమకు దూరమయ్యాడు బండ్ల గణేష్. నోటి దురుసుతో ఎన్నో వివాదాల్లోనూ గణేష్ ఇరుక్కున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా తన ఫౌల్ట్రీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటున్న గణేష్.. పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ కాలం గడుపుతున్నాడు.
ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి Dude!అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. Happy Birthday Darling Prabhas! 💐Wishing you Love , Happiness and Greater Glory! Have A Wonderful year ahead!🤗
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2024
Wishing my dearest friend #Prabhas a very Happy Birthday, may you continue to live a long and healthy life 🤗❤️
— Ram Charan (@AlwaysRamCharan) October 23, 2024
తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు బండ్ల గణేష్. రాజాధిరాజ రాజమార్తాండ మహారాజా శ్రీ ప్రభాస్ రాజుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు గణేష్. ఇక మెగాస్టార్ చిరంజీవి.. ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డూడ్, అతను ప్రేమించే పద్ధతి చూసి మనం కూడా ప్రేమించేస్తాం అంటూ ట్వీట్ చేశారు చిరు. నా ప్రియ మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు.. నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని చరణ్ ట్వీట్ చేశారు.
Happy birthday to the sweetest #Prabhas! Wishing you a year filled with peace, love, and lots of delicious food 🤗❤️ pic.twitter.com/RxaYV93pxr
— Venkatesh Daggubati (@VenkyMama) October 23, 2024
ఇక దగ్గుబాటి వెంకటేష్ అయితే ప్రభాస్ చేసే మర్యాదల గురించి ప్రస్తావించారు. ప్రియమైన ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఈ ఏడాది శాంతి, ప్రేమ నీ జీవితంలో పొందాలని వెంకీ ఆకాంక్షించారు. వీరితో పాటు ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, దర్శకులు గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ, ప్రశాంత్ వర్మ, నారా రోహిత్, ఆది సాయికుమార్ తదితరులు కూడా ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.


Click it and Unblock the Notifications











