పవన్ కల్యాణ్ కు వదిన సురేఖ గిఫ్ట్ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎన్ని లక్షలో తెలుసా?

జనసేన అధినేత , ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాలు కదిపినా, మాట్లాడినా , ఏం చేసినా సెన్షేషన్ అవుతుందనడంలో అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆయన ఇమేజ్ ఆకాశమంత. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటి చేత్తో కూటమిని అధికారంలోకి తీసుకురావడమే కాదు.. ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్‌దే కీలకపాత్ర. సినీ, రాజకీయ రంగాల్లో అరుదైన ఘనతలు సాధించి.. ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు పవన్. విపక్షనేతగా ప్రజల గొంతుకగా మారిన ఆయన.. నేడు పాలకుడిగా తన మార్క్ చూపించనున్నారు.

ఎన్నికల్లో జనసేనాని ఘన విజయంతో మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి అయితే తమ్ముడి సక్సెస్ చూసి పొంగిపోతున్నారు. ఆయన ఇప్పట్లో నేలమీదకి దిగివచ్చేలా కనిపించడం లేదు. ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి తొలిసారిగా ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ దంపతులకు మెగా ఫ్యామిలీ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది . అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ, తల్లి అంజనా దేవి పాదాలకు నమస్కరించి వారిపై తన అభిమానాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్.

mega star chiranjeevi wife surekha konidela gave a gift to AP Dy CM pawan kalyan price details here

ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరోసారి అన్నయ్య ఇంటికి వెళ్లిన పవన్ మరోసారి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సురేఖ ఆయనకు అరుదైన బహుమతిని అందజేశారు. ఆ గిఫ్ట్ ఏంటంటే .. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన మోంట్ బ్లాంక్ పెన్నును సురేఖ బహుమతిగా ఇచ్చారు. ఖరీదైన ఈ పెన్నును ఆమె పవన్ జేబులో అప్యాయంగా పెట్టారు. ఆ పెన్నుతో పాటు తాను తొలుత సంతకం పెట్టిన రూ.10 పెన్నును కూడా తన జేబులో ఉంచుకోవడం విశేషం. అంతేకాదు.. తెలుగు ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మీ అన్న వదిన అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు.

అయితే చిరంజీవి దంపతులు ఇచ్చిన పెన్ను సాదాసీదాది కాదు. నెటిజన్లు ఈ పెన్ను కాస్ట్ ఎంతో తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ను జల్లెడ పట్టారు. ఈ మోంట్ బ్లాంక్ వాల్ట్ డిస్నీ పెన్నులు సాధారణ పెన్నుల కంటే ఖరీదెక్కువ. పవన్‌కు సురేఖ ఇచ్చిన పెన్ను మోడల్ '' మోంట్ బ్లాంక్ గ్రేట్ క్యారెక్టర్స్ ఫౌంటెన్ పెన్ 1901 లిమిటెడ్ ఎడిషన్ వాల్ట్ డిస్నీ మీడియం ''. దీని ధర అక్షరాలా రూ.3,56,200. వీటిలో బాల్ పాయింట్ పెన్నులు ఓ రేటు.. ఫౌంటేన్ పెన్నులు మరో ధర ఉంటాయట. బాల్ పాయింట్ పెన్నులు రూ.90 వేల స్థాయిలో.. ఫౌంటేన్ పెన్నుల ధరలు మాత్రం రూ.2.60 లక్షలు పైనే ఉంటాయట. పవన్‌ కళ్యాణ్‌కు చిరంజీవి దంపతులు బహుకరించిన పెన్ను ధర చూసి అభిమానులు అవాక్కవుతున్నారు.

mega star chiranjeevi wife surekha konidela gave a gift to AP Dy CM pawan kalyan price details here

కాగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయించారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. తొలుత పవన్‌కు హోంశాఖను కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు నాయుడులు సైతం హోంశాఖను తీసుకోవాల్సిందిగా కోరారు. అయితే పవన్ మాత్రం తనకు ఎంతో ఇష్టమైన గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ఈ శాఖను ఏరికోరి తీసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X