Varun Tej యాక్షన్ మూవీ గాండీవదారి అర్జున రిలీజ్ డేట్ ఫిక్స్.. రాబోయేది ఎప్పుడంటే..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కటౌట్ కి సరైన యాక్షన్ కథలు పడితే కచ్చితంగా అతని నుంచి నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ మెగా హీరో రెగ్యులర్ కమర్షియల్ జోనర్ లో సినిమాలు చేయకుండా యునిక్ కంటెంట్ ఎంపిక చేసుకుంటూ కొత్త కథలతో ఎక్కువగా ప్రయోగాలు చేస్తున్నారు. అందుకే అంతరిక్షం లాంటి సినిమాని తెలుగులో ఇతర హీరోలు ఎవరూ కూడా చేయడానికి ఇష్టపడరు.
కాని వరుణ్ తేజ్ మాత్రం ప్రయోగానికి ఒకే చెప్పాడు. కమర్షియల్ గా ఈ చిత్రం హిట్ కాకుండా మంచి చిత్రం అనే ప్రసంశలు సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. గాండీవదారి అర్జున టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. భారీబడ్జెట్ తో బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మూవీలో ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం మెజారిటీ షూటింగ్ యురోపియన్ దేశాలలోనే జరిగింది. కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ని ఇప్పటికే పూర్తి చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ డేట్ ని తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో బిల్డింగ్ గోడ పై గన్ పట్టుకొని బ్లాక్ కాస్ట్యూమ్స్ లో వరుణ్ తేజ్ ఉన్నాడు.
అతని ముందు బాంబ్స్, గన్స్, బుల్లెట్స్ ఉన్నాయి. బ్యాక్ డ్రాప్ లో సిటీలో బిల్డింగ్స్, సిటీ మధ్యలో బ్లాస్టింగ్స్ తో పోస్టర్ ఎలివేట్ చేశారు. దీనిని బట్టి సినిమా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయని అర్ధమవుతోంది. అలాగే హాలీవుడ్ యాక్షన్ మూవీస్ తరహాలో ఉండబోతోందని క్లారిటీ వస్తోంది.
ప్రవీణ్ సత్తారు చివరిగా కింగ్ నాగార్జనతో ది ఘోస్ట్ మూవీ చేశారు. ఈ సినిమా కూడా స్టైలిష్ యాక్షన్ చిత్రంగానే తెరకెక్కింది. పర్వాలేదనే టాక్ వచ్చిన ఎందుకనో కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. ఇప్పుడు వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున చిత్రం కోసం ఏకంగా యూరప్ వెళ్ళిపోయి కథని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ మూవీ ఆగష్టు 25న ఏ మేరకు ప్రేక్షకులని అలరిస్తుంది అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











