ఆమె ముందు మెగాస్టార్ కూడా పసివాడే.. ప్రేమతో ఛాలెంజ్ ఫినిష్!
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టిన తరువాత అభిమానులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారనే చెప్పాలి. గ్యాప్ లేకుండా ప్రతి విషయంపై స్పందిస్తూ తోటి హీరోలపై కూడా స్నేహపూర్వక కామెంట్స్ తో మంచి ఫన్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ లాక్ డౌన్ లో స్పెషల్ గా కనిపిస్తున్నారు. ఇంటి పనులు చేసుకుంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్..
ఇటీవల దర్శకుడు రాజమౌళి #betherealman ఛాలెంజ్ లో భాగంగా ఎన్టీఆర్ ని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్.. ఇంట్లో వారి ప్రేమతో పాటు పని కూడా పంచుకోవాలని చెబుతూ.. ఇంట్లో పనులను చేస్తున్నాడు. ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అయితే వెంటనే తారక్ బాబాయ్ బాలక్రిష్ణతో పాటు మెగాస్టార్, వెంకటేష్, నాగార్జున, కొరటాల శివలను కూడా నామినేట్ చేశారు.

మరోసారి తారక్ కోసం..
తారక్ ఇచ్చిన ఛాలెంజ్ ను చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. అసలైతే లాక్ డౌన్ మొదటి రోజు నుంచే మెగాస్టార్ ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేశారట. గార్డెన్ శుభ్రం చేస్తూ ఇంటిని శుభ్రం చేసుకుంటూ తల్లికి ప్రేమగా వండిపెట్టాడు కూడా. దోశ చేయడంలో సిద్ధహస్తుడైన మెగాస్టార్ తన తల్లి అంజనా దేవి ముందు పసివాడిలా కనిపించాడు. ఎంతటి వారైనా ఆ తల్లి ముందు పసివాడే అని మెగాస్టార్ చెప్పకనే చెప్పాడు.
ప్రేమతో ఛాలెంజ్..
జూనియర్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ ని తల్లి ప్రేమతో పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి అందరికంటే డిఫరెంట్ గా తల్లి ప్రేమను చూపిస్తూ ఛాలెంజ్ ని పూర్తి చేశాడు. రోజు చేసే పనులే అంటూ కామెంట్స్ చేసిన మెగాస్టార్ అదే విధంగా తెలంగాణ మంత్రి కేటీఆర్, సూపర్ స్టార్ రజినీకాంత్ లను నామినేట్ చేశారు. మరి వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి.
Recommended Video

ఆచార్యతో బిజీ..
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ సినిమా అనంతరం మెగాస్టార్ బాబీ డైరెక్షన్ లో మరొక సినిమా వెంటనే స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











