తమ్ముడు కోసం మెగాస్టార్ గెస్ట్ రోల్.. పంచెకట్టుతో పవన్, చిరు.. మెగా హీరోల ఫొటో వైరల్!

Recommended Video

Pawan Kalyan And Chirajnjeevi Photo Goes Viral | Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి ఓ పక్క సైరా షూటింగ్‌లో బిజీగా ఉండగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ యాత్రలతో రఫ్ ఆడిస్తున్నాడు. వీరిద్దరు తాజాగా కలుసుకోవడం మీడియాలో హాట్‌గా మారింది. వీరిద్దరి కలయిక సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారికి సంబంధించిన ఫొటో మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ ఫొటో వెనుక కథేంటంటే..

పవన్ కల్యాణ్ గృహప్రవేశం

పవన్ కల్యాణ్ గృహప్రవేశం

పవన్ కల్యాణ్ రాజకీయ పర్యటనకు కాస్త బ్రేక్ ఇచ్చి ఇంటిని చక్కపెట్టుకొనేందుకు వచ్చారు. ఇటీవల జూబ్లీహిల్స్‌లోని ఓ విలాసవంతైన ఇంటిలోకి మారారు. ఈ సందర్భంగా జరిగిన గృహప్రవేశ పూజకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంప్రదాయ దుస్తుల్లో మెగా హీరోలు

సంప్రదాయ దుస్తుల్లో మెగా హీరోలు

పవన్ కల్యాణ్, చిరంజీవి సంప్రదాయ దుస్తుల్లో తయారై ఫోటోకు ఫొజిచ్చారు. తెల్లటి దుస్తుల్లో లాల్చీ, పంచెకట్టుతో మెగా బ్రదర్స్ ఇరుగదీశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. మెగా బ్రదర్స్ ఇద్దరూ కలిసి కనిపించడంతో అభిమానులకు పండుగలా మారింది.

పవన్ కల్యాణ్, చిరు మధ్య

పవన్ కల్యాణ్, చిరు మధ్య

గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి తన సోదరుడితో ఆహ్లాదకరంగా చాలా సమయాన్ని గడిపాడట. తన రాజకీయ పార్టీ ఎదుగుదల, ప్రచార కార్యక్రమాలను అడిగి తెలుసుకొన్నాడట. జనసేన పార్టీ విషయాలు వారి మధ్య చర్చకు వచ్చాయట.

 ఒక్క చోట చేరిన మెగా హీరోలు

ఒక్క చోట చేరిన మెగా హీరోలు

ఇక ఇలా ఉంటే ఇటీవల దీపావళీ పండుగ సందర్భంగా మెగా హీరోలంతా ఒక్కచోట చేరారు. పవన్ కల్యాణ్ మినహా అందరూ కలిసి పండుగ చేసుకొన్నారు. ఈ అపూర్వ కలయికకు సాయి ధరమ్ తేజ్ సోదరులు, అల్లు అర్జున్ సోదరులు, వరుణ్ తేజ్, రాంచరణ్ సాక్ష్యంగా నిలిచారు. అందరూ కలిసిన ఫొటో వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X