twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా ముప్పుతో జాగ్రత్త.. ఆరోగ్యం కోసం ఇలా చేయండి.. చిరంజీవి చిట్కాలు, సలహాలు

    |

    అందరికీ ఉగాది శుభాకాంక్షలు.. అయితే ఈ పండుగని పండుగలా జరుపుకునే పరిస్థితి లేదు. నేటి ఈ లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఇంటిపట్టునే ఉండి కరోనా మహమ్మారి మరింత వ్యాపించకుండా ఉండేలా సహకరించాలని వేడుకుంటున్నాను అని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "బాధ్యతారాహిత్యంగా బయటకి వచ్చి, మరింత వ్యాప్తి చెందడానికి దోహదపడొద్దని వేడుకుంటున్నాను అని చిరంజీవి అన్నారు.

    మరిన్ని జాగ్రత్తలు అవసరం

    మరిన్ని జాగ్రత్తలు అవసరం

    కరోనావైరస్ నేపథ్యంలో పొడిగించబడిన లాక్‌డౌన్ సమయంలో మరికొన్ని జాగ్రత్తలు విధిగా పాటించడం అవసరం, ఉత్తమం రోజువారీగా వాడే పచారి సమానులు వీలైనంత తక్కువగా వాడుకుంటూ పొదుపు చేసుకోవాలి. వేపుళ్ళు, కాలక్షేప తినుబండారాలు లేకుండా చూసుకోవాలి. అలాగే పాయసం, పరమాన్నం, అరిసెలు లాంటి తీపి పిండివంటలు వదిలేద్దాం. ఖాళీగా ఉన్నాం కదా కొత్త వంటలు చేద్దాం అనే ఆలోచన గానీ, అలాంటి ప్రయోగాలు కానీ మానుకుందాం అని చిరంజీవి సలహాలు ఇచ్చారు.

    బామ్మలు, అమ్మమ్మలు..

    బామ్మలు, అమ్మమ్మలు..

    మన చిన్నతనంలో బామ్మలు, అమ్మమ్మలు, అమ్మ మనకు చేసిపెట్టిన తరహాలో కనీస కూరలతో భోజనం కానిద్దాం. నిత్యావసర వస్తువుల్ని ఆచితూచి పొదుపుగా వాడుకుందాం. అలా చెయ్యడం వలన అన్నీ అయిపోయాయి, కొనాలంటే వస్తువులు దొరకడం లేదు అనే కంగారు, ఆందోళన పడే పరిస్థితి రాదు. ఈ 3వారాలకు కావాల్సిన సరుకులు, అవసరం మేరకు మాత్రమే కొని పొందుపరుచుకుందాం అని చిరంజీవి సూచించారు.

    అనవసర ఖర్చులు వద్దు

    అనవసర ఖర్చులు వద్దు

    కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకైనా మంచిది అని అవసరం మీరి కొనడం వలన బయట చిన్న బిడ్డలకు, వృద్ధులకు, అవసరార్ధులకు ఆయా వస్తువులు దొరకక కొరత ఏర్పడవచ్చు. కనుక పొదుపు ఆచరించి ఇతరుల అవసరాలకు కూడా సహకరిద్దాం. ఇలా తగ్గించి వాడడం ద్వారా ఇంట్లో చెత్త కూడా ఎక్కువగా పేరుకుపోదు. తద్వారా వీధిలోని చెత్త కూడా పేరుకుపోదు, ఇలా పారిశుద్ధ్యానికి సహకరిద్దాం అని తెలిపారు.

    Recommended Video

    RRR Motion Poster : Megastar Chiranjeevi, RGV Reacts On RRR Title & RRR Motion Poster
    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిద్దాం

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిద్దాం

    మనం భారతీయులం ఒక్కటై రోజు రోజుకి పెరుగుతున్న ఈ వైరస్ వ్యాప్తిరి పెరగనివ్వకుండా నివారిద్దాం.. నేలమట్టం చేద్దాం. లాక్ డౌన్ ప్రకటించిన మన ప్రధాని నరేంద్ర మోడీ గార్కి, సహకరిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా అభినందనలు, ధన్యవాదాలు. ఈ సమయంలో ఇంటిపట్టునే ఉండి ఆరోగ్యంగా ఉందాం.. ఆరోగ్యం పంచుదాం.. జైహింద్ అని చిరంజీవి తెలిపారు.

    English summary
    Megastar Chiranjeevi about Coronavirus precautions and Lockdown. He has given some food, and health precautions amid corona scare.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X