Chiranjeevi: వైరస్ కంటే మన భయమే మనల్ని ముందు చంపేస్తుంది.. ప్రజలకు మెగాస్టార్ సూచన

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి విషయం చెప్పినా చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చెబుతారని అందరికి తెలిసిన విషయమే. ఎలాంటి విపత్తులు ఎదురైనా కూడా ఆదుకోవడానికి తనవంతు సహాయం చేస్తుంటారు. ఇక కరోనా కష్ట కాలంలో కూడా సినీ పరిశ్రమలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు తనవంతు సహాయం అందించడానికి కృషి చేస్తున్నారు.

ఇక కోవిడ్ తీవ్రత ఎక్కువవుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉందని అంటూ ఈ వైరస్ భారిన పడి ఎంతోమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు చెప్పారు. కొలుకోవడానికి కూడా చాలా సమయం పడుతోందని. మన అత్మీయులు ఈ వైరస్ కారణంగా కోల్పోతున్నాము అంటే బాధగా ఉంటోంది. ఇక ఈ తప్పని పరిస్థితులలో కరోనాను అదుపు చేయడం కోసం తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టడం జరిగిందని మెగాస్టార్ తెలిపారు.

Megastar chiranjeevi about defeat corona

ఇక అప్పటి నుంచి అయినా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఇంటి నుంచి వీలైనంత వరకు బయటకు రావద్దని ఒకవేళ వస్తే రెండు మాస్కులు ధరించాలని అన్నారు. వ్యాక్సినేషన్ వేసుకుంటే కరోనా వచ్చినా నియంత్రించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కరోనా పాజిటివ్ వస్తే ఏ మాత్రం పానిక్ అవ్వకూడదని వైరస్ కంటే మన భయమే మనల్ని ముందు చంపేస్తుందని తెలియజేశారు.

ఇక కరోనా వచ్చిన వెంటనే కుటుంబ సబ్యులకు దూరంగా ఐసోలెట్ చేసుకోవడం మంచిది అంటూ.. రెండు నెలల తరువాత ప్లాస్మా డోనేట్ చేస్తే రెండు నిండు ప్రాణాలను కాపాడిన వారు అవుతారని చెప్పారు. ఈ కరోనా నుంచి ప్రతి ఒక్కరు కొలుకోవాడానికి కృషి చేయాలని వీలైతే అందరికి ఈ సమాచారాన్ని చేరవేయాలని మెగాస్టార్ చిరంజీవి వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X