న్యూ లుక్ పై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆచార్య కోసం కాదట!
మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసు దాటుతున్నా కూడా ఇంకా యువ హీరోల మాదిరిగానే జనాలను ఆకర్షిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఎలాంటి లుక్ తో ఆకట్టుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సైరా సినిమాలో అంతకంటే డిఫరెంట్ లుక్ తో ఎట్రాక్ట్ చేశారు. ఇక నెక్స్ట్ ఆచార్య సినిమాలో మునుపెన్నడు కనిపించని విధంగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు.

ఆ సినిమాలో విభిన్నమైన పాత్రలు
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో మంచి మెస్సేజ్ ఇవ్వనున్న ఆ సినిమాలో మెగాస్టార్ రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించబోతున్నాడు. గవర్నమెంట్ దేవాదాయ శాఖ ఉద్యోగి గానే కాకుండా ఒక నక్సలైట్ పాత్రలో మెప్పించనున్నట్లు తెలుస్తోంది.

న్యూ లుక్ తో షాక్..
అంతా బాగానే ఉంది గాని ఇటీవల సడన్ గా మెగాస్టార్ సరికొత్త లుక్ తో దర్శనమివ్వడం జనాలను ఒక విధంగా ఆశ్చర్యనికి గరి చేసింది. మీసాలు గడ్డాలు లేకుండా క్లీన్ షేవింగ్ చేసుకొని సరికొత్తగా కనిపించారు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోలు కూడా చాలానే వైరల్ అవుతున్నాయి.

న్యూ లుక్.. ఎందుకంటే..
మెగాస్టార్ సడన్ గా లుక్కు ఎందుకు మార్చారు అనే సందేహం అందరిలోను కలిగింది. అలాగే అనేక రకాల రూమర్స్ కూడా వచ్చాయి. ఆచార్య సినిమా కోసమే మెగాస్టార్ కొత్త లుక్ సెట్ చేసుకున్నారు అనే టాక్ రాగా ఆ రూమర్స్ పై స్పందించక తప్పలేదు. నిజానికి సినిమా కోసం మెగాస్టార్ అలా మారలేదట.
Recommended Video

కొత్తగా ఉంటుందని..
మొదట రూమర్స్ గురించి వినగానే మెగాస్టార్ నవ్వేసి కేవలం సరదాగా కొత్తగా ఉంటుందని అలా తనను తానే మార్చుకున్నారట. అంతేగాని ఏ సినిమా కోసం ఈ విధంగా చేయడం లేదని మెగాస్టార్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఆచార్య అనంతరం మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











